ఆర్ఎస్ఎస్సభ్యుడు.. రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి ఇప్పుడు మరో ప్రతిఙ్ఞ చేశారు. శ్రీకృష్ణ జన్మస్థలమైన మథురలో కృష్ణుడి ఆలయ నిర్మాణం జరిగే వరకు రోజుకు ఒక్కసారి మాత్రమే భోజనం చేస్తానని చెప్పారు.
అయోధ్య రామమందిరం కోసం ఎందరో ఎన్నో ప్రతినలు బూనారు. అయోధ్యలో రామ మందిరం నిర్మించే వరకు మెడలో మాల ధరించనని చేసిన ప్రతిఙ్ఞను ఆర్ఎస్ఎస్ సభ్యుడు .. రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి దిలావర్అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ అనంతరం మాలను ధరించి సోమవారం దీక్షను విరమించారు. . ఈ సందర్భంగా తన కరసేవ జ్ఞాపకాలను వివరించిన మదన్ దిలావర్ మరో ప్రతిన బూనారు. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా రామ్‌గంజ్ మండి సిటీలో జరిగిన ర్యాలీలో దిలావర్ ఢమరుకం వాయించారు.