టార్గెట్‌ బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌.. భారీ మోసానికి తెరలేపిన రాజస్థాన్‌‌‌ ముఠా

టార్గెట్‌ బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌.. భారీ మోసానికి తెరలేపిన రాజస్థాన్‌‌‌ ముఠా

గచ్చిబౌలి, వెలుగు: ఒక వస్తువు కొనుగోలు చేసి యూపీఐ ద్వారా చెల్లింపు చేయడం, తర్వాత పొరపాటు జరిగిందంటూ బ్యాంక్‌‌‌‌కు లెటర్‌‌‌‌ రాసి రీఫండ్‌‌‌‌ తీసుకోవడం.. ఇలా మోసం చేస్తున్న ఓ ముఠాను సైబరాబాద్‌‌‌‌ పోలీసులు అరెస్ట్‌‌‌‌ చేశారు. బజాజ్‌‌‌‌ ఎలక్ట్రానిక్స్‌‌‌‌ను టార్గెట్‌‌‌‌గా చేసుకొని రూ.4 కోట్ల వరకు మోసం చేసినట్లు గుర్తించి, 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్‌‌‌‌ కమిషనరేట్‌‌‌‌లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో క్రైమ్‌‌‌‌ డీసీపీ నర్సింహ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

 ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్‌‌‌‌కు చెందిన సోంరాజ్, సునీల్, లక్‌‌‌‌రాం, శర్వాన్​, సోమ్‌‌‌‌రాజ్‌‌‌‌, రమేశ్‌‌‌‌, శివలాల్, శ్రవణ్, పప్పురాం, శ్రవణ్, రాకేశ్‌‌‌, రమేశ్‌, అశోక్‌‌‌‌ కుమార్‌‌‌‌ముఠాగా ఏర్పడ్డారు. ఈజీ మనీ కోసం మోసాలకు పాల్పడుతున్నారు. ఇందులో భాగంగా ముఠాలోని కొందరు సభ్యులు హైదరాబాద్లో, మిగతా వారు రాజస్థాన్‌‎లో ఉంటారు. హైదరాబాద్‌‌‌‌లో ఉన్న గ్యాంగ్‌‌‌‌ స్థానికంగా ఉన్న ఓ బజాజ్‌‌‌‌ ఎలక్ట్రానిక్స్‌‌‌‌ షోరూంకు కస్టమర్లుగా వెళ్తారు. 

షోరూంలో ఏవైనా వస్తువులను కొనుగోలు చేశాక, తమ వారు యూపీఐ ద్వారా పేమెంట్‌‌‌‌ చేస్తారని చెప్పి షోరూం క్యూఆర్‌‌‌‌ కోడ్‌‌‌‌ను రాజస్థాన్‌‌‌‌లోని తమ గ్యాంగ్‌‌‌‌ సభ్యులకు పంపిస్తారు. వారు క్యూఆర్‌‌‌‌ కోడ్‌‌‌‌ను స్కాన్‌‌‌‌ చేసి డబ్బులు పంపిస్తారు. ట్రాన్సాక్షన్‌‌‌‌ పూర్తి కాగానే ఎలక్ట్రానిక్‌‌‌‌ వస్తువులను కొనుగోలు చేసిన వ్యక్తులు వాటిని తీసుకొని బయటకు వచ్చేస్తారు. వాటిని బయట ఇతర వ్యక్తులకు అమ్మేసి డబ్బులు పంచుకుంటారు. 

తప్పుడు ట్రాన్సాక్షన్‌‌‌‌ అయిందంటూ..

షోరూంలో కొన్న వస్తువును బయట అమ్మేసిన తర్వాత రాజస్థాన్‌‌‌‌లో ఉన్న గ్యాంగ్‌‌‌‌ సభ్యులు బ్యాంక్‌‌‌‌కు వెళ్లి తమ బ్యాంక్‌‌‌‌ నుంచి పొరపాటున తప్పుడు ట్రాన్సాక్షన్‌‌‌‌ అయిందని అప్లై చేసి, చార్జ్‌‌‌‌ బ్యాక్‌‌‌‌ ద్వారా డబ్బులు తిరిగి పొందుతారు. పెద్ద ఎత్తున చీటింగ్‌‌‌‌ జరిగిన విషయాన్ని ఆడిట్‌‌‌‌టైంలో గుర్తించిన బజాజ్‌‌‌‌ఎలక్ట్రానిక్స్‌‌‌‌ ప్రతినిధులు శంషాబాద్‌‌‌‌ సీసీఎస్‌‌‌‌, కేపీహెచ్‌‌‌‌బీ, మాదాపూర్‌‌‌, నార్సింగ్‌‌‌‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 దీంతో ఎంక్వైరీ స్టార్ట్‌‌‌‌ చేసిన పోలీసులు మూడు నెలల్లో సుమారు 1127 ట్రాన్సాక్షన్లు చేసి చార్జ్‌‌‌‌ బ్యాక్‌‌‌‌ ద్వారా రూ.4 కోట్లు మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో రాజస్థాన్‌‎కు చెందిన 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.50 లక్షల విలువైన ఎలక్ట్రానిక్స్‌‌‌‌ వస్తువులు, రూ. 1.72 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ గ్యాంగ్‌‌‌పై సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్లు, మహబూబ్​నగర్, జడ్చర్ల పోలీస్‌‌‌‌ స్టేషన్ల పరిధిలో మొత్తం 10 కేసులు ఉన్నాయని డీసీపీ చెప్పారు.