ప్రభుత్వం సంచలన నిర్ణయం: ఒకేసారి 54 మంది IAS, 24 మంది ఐపీఎస్‎లు ట్రాన్స్‎ఫర్

ప్రభుత్వం సంచలన నిర్ణయం: ఒకేసారి 54 మంది IAS, 24 మంది ఐపీఎస్‎లు ట్రాన్స్‎ఫర్

జైపూర్: రాజస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఊహించని విధంగా ఒకేసారి పెద్ద మొత్తంలో సివిల్ సర్వీసెస్ అధికారులకు స్థాన చలనం కల్పించింది. ఏకకాలంలో 54 మంది ఐఏఎస్, 24 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. వీరితో పాటు 34 మంది ఐఎఫ్ఎస్,  113 ఆర్ఏఎస్ ఆఫీసర్లను ట్రాన్స్‎ఫర్ చేసింది. ఈ మేరకు శనివారం (ఫిబ్రవరి 1) ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

ఒకేసారి ఇంత పెద్దమొత్తంలో సివిల్ సర్వీసెస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎం భజన్ లాల్ శర్మ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పొలిటికల్, ఐఏఎస్ వర్గాల్లో హాట్ టాపిక్‎గా మారింది. రాజస్థాన్ బ్యూరోక్రాటిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగానే సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. తాజాగా జరిగిన బదిలీల్లో పలువురు సీనియర్ అధికారులు సైతం ఉండటం గమనార్హం. అయితే.. సివిల్ సర్వీసెస్ అధికారులను పెద్ద మొత్తంలో బదిలీ చేయడం రాజస్థాన్లో ఇదే తొలిసారి కాదు.

2024లో కూడా భజన్ లాల్ శర్మ భారీగా అధికారుల బదిలీలు చేపట్టింది. 2024లో 83 మంది ఆర్ఏఎస్ అధికారులకు స్థాన చలనం కల్పించింది ప్రభుత్వం. అలాగే.. గత ఏడాది సెప్టెంబర్ 6న రాష్ట్రంలో జరిగిన అతిపెద్ద పరిపాలనా సవరణల్లో భాగంగా 386 మంది ఆర్ఏఎస్ అధికారులను ట్రాన్స్‎ఫర్  చేసింది. ఈ సారి మాత్రం భారీ సంఖ్యలో ఐఏఎస్, ఐపీఎస్‎లను బదిలీ చేయడం గమనార్హం.