2024 ఎన్నికల నేపథ్యంలో ఏపీలో పొలిటికల్ హీట్ మాములుగా లేదు. అధికార ప్రతిపక్షాలు ఈ ఎన్నికల్లో ఎలా అయినా గెలవాలని ప్రతిష్టాత్మకంగా తీసుకోవటంతో రాష్ట్రం రణరంగాన్ని తలపిస్తోంది. ఎన్నికలకు కేవలం 25రోజులు మాత్రమే సమయం ఉండటంతో నేతలంతా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ముఖ్యంగా అభ్యర్థుల ప్రకటన మొదలుకొని ప్రచారం వరకు అన్ని పార్టీలకంటే రేసులో ముందున్న జగన్ ఎన్నికల ప్రచార సభలకు అనూహ్య స్పందన వస్తోంది. ఈ క్రమంలో జగన్ ప్రచార సభలకు సంబంధించిన వీడియోలు ఏపీలోనే కాకుండా రాజస్థాన్ లో కూడా వైరల్ అవుతున్నాయి.
వివరాల్లోకి వెళితే, రాజస్థాన్ లోని బార్మర్ జిల్లాకు చెందిన రవీంద్ర సింగ్ భాటి అనే వ్యక్తి ఈ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. అతని క్యాంపెయినింగ్ కోసం జగన్ సిద్ధం సభలకు సంబంధించిన వీడియోను వాడుకున్నాడు. అతని మద్దతుదారులు జగన్ సభలో ఉన్న అశేష జనసమూహానికి సంబంధించిన వీడియోను రవీంద్ర సింగ్ క్యాంపెయిన్ విడియోగా పేర్కొంటూ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది కాస్తా వైరల్ అవడంతో రాజస్థాన్ వ్యాప్తంగా అతని పేరు మార్మోగింది. దీంతో ఫ్యాక్ట్ చెక్ ఈ వీడియోను పరిశీలించగా అది రవీంద్ర సింగ్ క్యాంపెయిన్ కాదని, అసలు రాజస్థాన్ కి సంబందించిన వీడియో కాదని తేలింది. దీంతో ఇది జగన్ క్రేజ్ కి ఒక ఉదాహరణ అని సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.