ఈఆర్​సీపీ లింక్  ప్రాజెక్ట్​కు మార్గం సుగమం

ఈఆర్​సీపీ లింక్  ప్రాజెక్ట్​కు మార్గం సుగమం

న్యూఢిల్లీ, వెలుగు: అంతరాష్ట్రీయ నదుల అనుసంధానంలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. పర్బతి–కలిసింద్–చంబ్ ఈఆర్ సీపీ (ఈస్ట్రన్ రాజస్థాన్ కెనాల్ ప్రాజెక్ట్)కు సంబంధించి మధ్యప్రదేశ్, రాజస్థాన్ ల మధ్య ఒప్పందం కుదిరింది. ఢిల్లీలో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, మధ్య ప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, రాజస్థాన్ సీఎం భజన్ లాల్, నదుల అనుసంధానం టాస్క్ ఫోర్స్ చైర్మన్ వెదిరె శ్రీరాం, ఇతర అధికారులు హాజరయ్యారు. ఈఆర్ సీపీ ప్రాజెక్ట్ ద్వారా 2.8 లక్షల హెక్టార్లలో సాగునీటిని అందించడమే కాకుండా తూర్పు రాజస్థాన్, మాల్వా, మధ్యప్రదేశ్‌ చంబల్ ప్రాంతాల్లోని13 జిల్లాల్లో తాగునీరు– పారిశ్రామిక అవసరాలకు నీటిని అందించనున్నారు.