బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను చంపేస్తానని బెదిరించిన వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి మొబైల్ ఫోన్ నంబర్ ఆధారంగా అతన్ని కర్ణాటకలోని హుబ్బళ్లిలో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు రాజస్థాన్‌కు చెందిన బికారమ్ జలరామ్ బిష్ణోయ్(32)గా పోలీసులు గుర్తించారు. జలరామ్ బిష్ణోయ్.. రాజస్థాన్‌లోని జలోర్ జిల్లాకు చెందినవాడిగా తేల్చారు.
ఎందుకీ ఈ బెదిరింపులు..?
స్థానికంగా కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న జలరామ్ బిష్ణోయ్ కేవలం వినోదం కోసం ఈ పని చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. సల్మాన్ ఖాన్‌ను బెదిరింపులు అన్న వార్తను ఓ టీవీలో చూసి.. తాను బెదిరించాలని నిర్ణయించుకున్నట్లు నిందితుడు విచారణలో అంగీకరించినట్లు అధికారులు తెలిపారు. విచారణలో అతని నుంచి మరింత సమాచారాన్ని రాబడతామని వెల్లడించారు.
ఏమని బెదిరించాడు..?
నిందితుడు మంగళవారం(నవంబర్ 05) అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో ముంబై ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌లోని హెల్ప్‌లైన్ నంబర్‌ను ఫోన్ చేసి తాను జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడిగా చెప్పుకున్నాడు. అనంతరం తాను సల్మాన్ ఖాన్‌ను చంపాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. అలా సల్మాన్‌ను చంపకుండా ఉంటాలంటే.. అతను వెంటనే ఆలయంలో క్షమాపణ చెప్పాలని లేదా తనకు రూ. 5 కోట్లు చెల్లించాలని సూచించాడు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు.. ఫోన్ నెంబర్ ఆధారంగా నిందితుడి ఆచూకీ కనుగొన్నారు.