ఇండియాలో దెయ్యాలను  తరిమే గుడి ఎక్కడుందో.. తెలుసా..

ఇండియాలో దెయ్యాలను  తరిమే గుడి ఎక్కడుందో.. తెలుసా..

హిందువులకు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేవాలయాలున్నాయి.  ఏ దేవాలయం చరిత్ర.. అక్కడ ప్రతిష్ఠించిన స్వామిని బట్టి పేర్లు ఉంటాయి.  శివాలయం, ఆంజనేయస్వామి, హనుమంతుడు ఇలా అనేక గుళ్లు ఉంటాయి.  కొన్ని గ్రామాల్లో శివాలయాన్ని రామలింగేశ్వర స్వామి.. నీలకంఠేశ్వరస్వామి.. ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. ఇక వెంకటేశ్వరస్వామిని..  విష్ణుమూర్తి ఆలయమని.. లక్ష్మీనారాయణుని..బాలాజీ టెంపుల్​ అని పిలుస్తారు.  కాని రాజస్థాన్​ లో ఓ దేవాలయంలో ఉన్న బాలాజీ స్వామిని అంజన్న.. ఆంజనేయుడు అంటారు.. అక్కడున్న బాలాజీని హనుమంతుడు అని ఎందుకంటారు.. ఆ దేవాలయం ప్రత్యేకత ఏమిటి.. బాలాజీని .. బాల హనుమాన్​ రూపంలో ఎందుకు కొలుస్తారు.. అక్కడున్న స్వామి స్పెషల్​ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం,.  . .

శ్రీ వెంకటేశ్వరస్వామి రూపాలు.. పేర్లు.. అవతారాలు చాలా ఉన్నాయని హిందూ పురాణాలు చెబుతున్నాయి.  అలా వెంకన్న స్వామిని బాలాజీ అనే పేరుతో కూడా కొలుస్తుంటారు.  అయితే  నార్త్ ఇండియాలోని కొన్ని ఏరియాల్లో బాలాజీ అంటే హనుమంతుడు అని అంటారు.  ఇక్కడ బాలాజీని   బాల హనుమాన్ రూపంతో అంజన్నను పూజిస్తారు.ఉత్తర భారతదేశంలో  అలాంటి ఆలయాలు చాలానే ఉన్నాయి. కానీ, రాజస్తాన్​లోని మెహందీపూర్ బాలాజీ మందిర్ ( అంజన్న గుడి) మాత్రం సమ్ థింగ్ స్పెషల్ అంటున్నారు. భూతవైద్యానికి ఫేమస్ అయిన ఈ టెంపుల్ కి దేశం నలుమూలల నుంచి రోజు వేలాదిమంది జనాలు తరలి వస్తుంటారు.

దేవుడ్ని నమ్మినప్పుడు.. దెయ్యాలున్నాయది కూడా నమ్మాలి.. ఈ కొటేషన్

రాజస్థాన్​ మెహందీపూర్ బాలాజీ టెంపుల్( అంజన్న )  బయటే కాదు.. లోపలి ప్రాంగణంలో కూడా జనాలతో ఎప్పుడూ రద్దీ ఉంటుంది. ఈ దేవాలయంలో ఓ పక్క భక్తుల హనుమాన్ చాలీసా పఠనం, బ్యాండ్ మేళాలతో ఆ గుడి ప్రాంగణం మారుమోగుతుంటే... మరోపక్క పూనకాలతో ఊగిపోతూ... వెకిలి చేష్ఠలు చేస్తూ.. వారు ఏం చేస్తున్నారో.. వారికే కాదు... పక్కనున్న వారికి తెలియకుండా చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు.  ఒక్కమాటలో చెప్పాలంటే దెయ్యం పట్టిన వాళ్ల మాదిరిగా ... కాదు .. కాదు .. నిజంగా వారికి దెయ్యం పట్టిందని.. వారికి పట్టిన దెయ్యాన్ని వదిలించుకోవడానికే ఈగుడికి వచ్చామని చెబుతుంతాయి.  అందుకే దీనికి దెయ్యాల్ని తరిమే గుడి" అనే పేరుండటంతో ఫారిన్ టూరిస్టులు కూడా ఆసక్తిగా ఆ గుడి గురించి తెలుసుకునేందుకు వస్తుంటారు. దీంతో టూరిజం పరంగా కూడా ఆ ప్రాంతం బాగానే డెవలప్ అయ్యింది.  అందుకే ఈ దేవాలయం గోడలపై పెద్ద పెద్ద అక్షరాలతో దేవుడిని  నమ్మినప్పుడు.. దెయ్యాలున్నయని  కూడా నమ్మాలి.. అని  ఈ కొటేషన్  కనిపిస్తుంది.

Also Read :- మళ్లీ పెరుగుతున్న టమోటా

వణుకు పుడ్తది!

సాధారణంగా గుడి అంటే ప్రశాంత వాతావరణం.. ఆధ్యాత్మిక భావన.. దేవుడి పాటలు..భజనలు.. పూజలు ఇలా అన్ని ఊహించుకుంటాం.. కానీ.. ఈ ఆలయంలో అలాంటివి ఎక్కడా కనపడవు.   ఎందుకంటే ఇక్కడ దెయ్యాల్ని వదిలించేందుకు స్పెషల్ పూజలు జరుగుతుంటాయి. దెయ్యం బాధితులను  ఓ స్పెషల్ చాంబర్లో గొలుసులతో కట్టేసి ఉంచుతారు. అరుపులు, బ్యాండ్ల సౌండ్లతో ఆ ఆలయంలో ఎప్పుడూ గోల గోలగా ఉంటుంది. 

దెయ్యం బాదితులను రక్షించే క్రమంలో  అక్కడున్న పూజారులు పూజలు చేయడం.. మంత్రాలు చదువుతారు.  మరోపక్క ఇంకొందరు హనుమాన్ చాలీసా చదువుతూ బ్యాండ్ బాజాలు వాయిస్తుంటారు. మరి కొందరు  సియా కేరామ్ ( శ్రీరామ)  జపంతో ఆ ప్రాంతం దద్దరిల్లుతుంది. ఆ సౌండ్లకు అక్కడున్న అందరూ పరవశంతో డ్యాన్స్ చేస్తూ ఊగిపోతారు. చివరికి ఎవరైతే స్పృహ తప్పి పడిపోతారో.. వాళ్లకు  దెయ్యం  పట్టిందని.. వాళ్లు సైతాన్​  బాధితులు అని అంటారు. అర్జి, సావామణి, దర్యస్త్.. అనబడే కొన్ని పూజలను  ఒకదాని వెంట జరిపి దెయ్యాన్ని వదిలిస్తారు. 

ఈ గుళ్లో ఎక్కువ సేపు ఉండరు..

సాధారణంగా దేవాలయాలు అంటే ప్రసాదాలు ఇస్తుంటారు. జనాలు పంచిపెడుతూ ఉంటారు.  కాని ఈ గుళ్లో ఓ ప్రత్యేకమైన ఆచారం ఉంది.  ఎవరేం ఇచ్చినా తినకూడదు.. తాగకూడదు .. అంతేకాదు అసలు కొత్తవాళ్లతో మాట్లాడకూడదు. గుడి బయటకు వచ్చాక వెనక్కి తిరిగి చూసినా నష్టమే. వీటిల్లో ఏ ఒక్కటి చేసినా దుష్టశక్తుల్ని మీరే ఆహ్వానించినట్లే' అని పెద్ద బోర్డుపై రాసి ఉంటుంది. అందుకే ఈ ఆలయ వాతావరణంలో ఎక్కువసేపు ఎవరూ ఉండలేరు.

దేవుడికి సమర్పణ ఉండదు

గుళ్లు, మందిరాల్లో ప్రసాదాలు, దేవుళ్లకు సమర్పణలు, నైవేద్యాలు  ఉంటాయి. కానీ, వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉన్న మెహందీపూర్ బాలాజీ (అంజన్న)టెంపుల్లో అవేం కనిపించవు. గుడి బయట కొందరు నల్లరంగు ఉండల్ని చేతిలో పెట్టి డబ్బులు అడుగుతారు. వాటిని వద్దని పడేస్తే అరిష్టం జరుగుతుందని జనాల భయపడుతుంటారు. అందుకే బలవంతంగా వాటిని కొంటుంటారు. అయితే అవి తినడానికి కాదు. గుడిలో హోమ గుండాల్లో వేస్తారు. అలా చేస్తే కష్టాలు ఉండవని నమ్ముతారు. కానీ, ఈ మధ్యకాలంలో కొందరు బూందీలడ్డును 'సంకటమోచన బాలాజీకి సమర్పిస్తున్నారు. అయితే అలా చేయొద్దని మైకుల్లో అయ్యవార్లు వారిస్తూనే ఉంటారు. బాల హనుమాన్ విగ్రహం కాళ్ల దగ్గర ఎప్పుడూ నీరు ప్రవహిస్తుంటుంది. అయ్యగారు ఆ నీటిని ప్రసాదంగా జనాలకు పంచుతాడు. ఆ నీటిని తాగితే మానసిక సమస్యలు దూరం అవుతాయనేది మరో నమ్మకం.

Also Read :- మీకు షుగర్ ఉంటే.. ఈ డ్రైఫ్రూట్స్ అస్సలు తినొద్దు

దెయ్యాలతో పంచాయితీ!  

ఈ గుడి ప్రాంగణంలో ఆకర్షించే మరో అంశం భైరవ బాబా ఆలయం, ఆ ఆలయంలో జరిగే దెయ్యాల పంచాయితీ. బాధితుడు (దెయ్యం పట్టిన వ్యక్తి) నేరస్తుడు, భైరవ బాబా జడ్జి, మధ్యలో అయ్యవారు ఉండే లాయర్ లాగా వాదిస్తుంటాడు. చివరికి బాబా ఆదేశాలతో పవిత్ర జలాన్ని ఆ వ్యక్తి మీద జల్లి, అతనికి పట్టిన దెయ్యాన్ని తరిమి కొడతాడు పూజారి. అందుకు ప్రతిఫలంగా సదరు వ్యక్తి కుటుంబం భైరవ బాబాకి బియ్యం, మినపప్పు సమర్పించుకుంటుంది. ఈ తతంగం అంతా విచిత్రంగానే అనిపిస్తుంది. 2013లో జర్మనీ, నెదర్లాండ్, ఢిల్లీ ఎయిమ్స్, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ నుంచి కొందరు సైకియాట్రిస్ట్లు, సైంటిస్టులు ఒక గ్రూప్ గా ఏర్పడి ఈ గుడి గురించి, ఇక్కడ చేసే ట్రీట్ మెంట్ గురించి స్టడీ చేశారు కూడా.

గుడి కథ

ఒకప్పుడు ఈ ప్రాంతం దట్టమైన అడవి. శ్రీ మహంత్ జీ అనే వ్యక్తికి బాల హనుమాన్ కలలో కనిపించి తనను పూజించమని చెప్పాడట. కళ్లు తెరిచి చూసేసరికి ఎదురుగా విగ్రహం కనిపించిందట. దీంతో గుడి కట్టి ఆయన కుటుంబం బాలాజీకి పూజలు నిర్వహిస్తోంది. అంతేకాదు బాలాజీ విగ్రహం "స్వయంభు" అని చెప్తుంటారు. గతంలో కొందరు ఈ విగ్రహాన్ని బయటికి తీసే ప్రయత్నం చేస్తే.. ఎంత తవ్వినా బయటికి రాలేదనే కథ ప్రచారంలో ఉంది. ఈ ఆలయం కాంప్లెక్స్​ లో బాలాజీ ఆలయంతో పాటు భైరవ బాబాగుడి, అంజనా మాతా, కాళీ మాతా, పంచముఖి హనుమాన్ జీ, వినాయకుడి ఆలయాలు ఉన్నాయి. నార్త్ ఇండియాలో భూతవైద్యానికి ఫేమస్ గా, ఫస్ట్ ప్లేస్లో ఉంది ఈ గుడి.

ఈ గుడికి ఎలా వెళ్లాలంటే..

రాజస్తాన్ క్యాపిటల్ జైపూర్ సిటీకి 110 కిలోమీటర్ల దూరంలో దౌసా జిల్లాలో ఉంది ఈ గుడి. అయితే జైపూర్ మెయిన్ బస్టాండ్ నుంచి మెహందీపూర్ విలేజీ కి బస్సులు ఫ్రీక్వెంట్ గా ఉంటాయి. రైట్, రోడ్డు, ఫ్లైట్ రూట్​లో జైపూరికి చేరుకోవచ్చు. అక్కడి నుంచి మెహందీపూర్,  బాలాజీ మోద్ చౌరస్తాలో బస్ దిగాక గుడికి డైరెక్ట్ గా షేర్ ఆటోలు ఉంటాయి. పది రూపాయలకి బాలాజీ గుడి ముందు దించుతారు ఆటోవాలాలు. గుడి చుట్టుపక్కల అర కిలోమీటర్ దాకా తినడానికి ఏం దొరకదు. ఆ దూరం దాటి వెళ్తే కొన్ని హోటళ్లలో రోటీ-సేవ్ టమాటర్ సాల్టీ, చాయ్ మాత్రం దొరుకుతుంది.