
వెలుగు ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ : రాజస్థాన్ లోని ఎడారి ప్రాంతాల్లో వేసవి వచ్చిందంటే మూగ జీవాల ఆకలి దప్పికలు తీర్చడం సవాలుగా మారుతుంది. దీంతో రాజస్థానీలు తమ మూగ జీవాలను తోలుకుని పిల్ల జెల్లాతో ఒంటెలపై సామా న్లు వేసుకుని వందల కిలోమీటర్లు ప్రయాణించి తెలంగాణకు వలస వస్తుంటారు. మార్గమధ్యలో వచ్చే అడవులు, పచ్చిక ప్రాంతాల్లో మూగజీవాలను మేపుతూ బతికించుకుంటారు.
ఇలా మూడు, నాలుగు నెలల పాటు వివిధ ప్రాంతాల్లో తిరుగు తూ.. వానాకాలం మొదలవగానే సొంతూరు బాటపడతారు. శనివారం ఆదిలాబాద్ జిల్లాలో జాతీయ రహదారిపై వెయ్యికిపైగా ఆవులు, రెండొందలకుపైగా గొర్రెలను తోలుకుంటూ వెళ్తూ పది కుటుంబాలు కనిపించాయి. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో మూగజీవాలను మేపుకుంటూ పలు ప్రాంతాలు తిరుగుతామని ఆయా కుటుంబాలు తెలపగా.. ‘వెలుగు’ కెమెరా క్లిక్ మనిపించింది.