గత కొన్ని రోజులుగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్య ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడింది. కాస్తా ఉపశమనం పొందేలా కేంద్రం చర్యలు తీసుకొంది. లీటర్ పై రూ. 8, డీజిల్ పై రూ. 6 ఎక్సైజ్ సుంకం తగ్గిస్తున్నట్లు కేంద్రం శనివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. పలు రాష్ట్రాలు పన్ను తగ్గించే విషయంలో సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని కేంద్రం సూచించింది. దీంతో పలు రాష్ట్రాలు స్పందిస్తున్నాయి. కేరళ, రాజస్థాన్, ఒడిశా రాష్ట్రాలు పెట్రో ఉత్పత్తుల పన్నును (VAT) తగ్గించాయి. కేరళ ప్రభుత్వం పెట్రోల్ పై రూ. 2.41, డీజిల్ పై రూ. 1.36 తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. ఇక కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్ పెట్రోల్ పై రూ. 2.48, డీజిల్ పై రూ. 1.36 తగ్గించినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ వెల్లడించారు. ఒడిశా పెట్రోల్ పై రూ. 2.23, డీజిల్ పై రూ. 1.36 తగ్గించింది.
పన్నులు తగ్గించడం విషయంలో కొన్ని రాష్ట్రాలు స్పందించడం లేదు. రాష్ట్రాలు తగ్గిస్తాయని చూడడం న్యాయం కాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు తమిళనాడు ఆర్థిక మంత్రి పళనివేల్ టి. రాజన్. ధరలు పెంచిన సమయంలో రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలను కోరని కేంద్రం.. ఇప్పుడెందుకు పన్నులు తగ్గించాలంటున్నారని వ్యాఖ్యానించారు. ఇక భారతదేశంలో ప్రతి వస్తువు ధరలు పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వంపై పలు విమర్శలు వస్తున్నాయి. ప్రధానంగా పెట్రోల్ ఉత్పత్తుల ధరలు రోజురోజుకు అధికమౌతూ వస్తున్నాయి. ఈ క్రమంలో.. వీటిపై ఆధారపడిన వస్తువుల ధరలు కూడా పెరిగిపోయాయి. దీంతో చమురు, గ్యాస్, నిర్మాణ రంగ వస్తువులపై విధించే సంకాలు తగ్గించింది. తగ్గింపుతో లీటర్ పెట్రోల్ పై రూ. 9.50, డీజిల్ పై రూ. 7 తగ్గే అవకాశం ఉంది. గత సంవత్సరం దీపావళి సమయంలో లీటర్ పెట్రోల్ రూ. 5, డీజిల్ పై రూ. 10 తగ్గించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో పలు రాష్ట్రాలు తమ వంతు పన్ను తగ్గించాయి. అయితే.. కొన్ని రాష్ట్రాలు స్పందించడం లేదు. రానున్న రోజుల్లో ఏ రాష్ట్రం పన్నులు తగ్గిస్తాయో చూడాలి.
మరిన్ని వార్తల కోసం : -
రేపు జపాన్కు వెళ్లనున్న పీఎం మోడీ
రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన కాశ్మీర్ యువకుడు..ఎలానో తెలుసా ?