జైపూర్: ఢిల్లీతో మ్యాచ్‌లో తాను వేసిన ఆఖరి ఓవర్ కెరీర్‌లో బెస్ట్ అని రాజస్తాన్ పేసర్ అవేశ్ ఖాన్ అన్నాడు. డెత్ ఓవర్స్‌లో ఇంతకంటే మంచి ఓవర్ ఎప్పుడూ వేయలేదన్నాడు. ‘నేను లాస్ట్ ఓవర్ వేయడం ఇదే మొదటిసారి కాదు.
గతేడాది రాజస్తాన్‌పై కూడా ఇలాగే వేశా. మరోసారి ఢిల్లీకి ఆడినప్పుడు కూడా లాస్ట్ ఓవర్ బాగా వేశా. కానీ స్ట్రాటజీ పరంగా ఇదే నా అత్యుత్తమ ఓవర్. అన్ని బాల్స్ ఒకే ప్లేస్‌లో ఒకే లెవెల్లో వైడ్ యార్కర్లుగా పడ్డాయి. ఇలాంటి బాల్స్ ఆడటం ఎలాంటి బ్యాటర్‌కైనా కష్టమే’ అని అవేశ్ పేర్కొన్నాడు.