IPL 2025: టీమిండియా నుంచి రాజస్థాన్‌కు: రాయల్స్ జట్టులో విక్రమ్ రాథోర్

IPL 2025: టీమిండియా నుంచి రాజస్థాన్‌కు: రాయల్స్ జట్టులో విక్రమ్ రాథోర్

ఐపీఎల్ 2025 లో టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్‌ రాజస్థాన్ రాయల్స్ జట్టులో చేరాడు. 2025 ఐపీఎల్ కు రాజస్థాన్ రాయల్స్ తమ బ్యాటింగ్ కోచ్‌గా భారత మాజీ ఓపెనర్ విక్రమ్ రాథోర్‌ను నియమిస్తున్నట్లు శుక్రవారం (సెప్టెంబర్ 20) ప్రకటించింది. "రాథోర్ అనుభవజ్ఞుడైన ప్రొఫెషనల్ క్రికెటర్. రాహుల్ ద్రవిడ్‌ను తిరిగి ప్రధాన కోచ్‌గా వచ్చిన కొన్ని రోజులకే రాయల్స్ కోచింగ్ సెటప్‌లో చేరాడు" అని రాజస్థాన్ రాయల్స్ ఒక ప్రకటనలో తెలిపింది.

ALSO READ | SL vs NZ 2024: శ్రీలంక, న్యూజిలాండ్ మ్యాచ్‌కు నేడు బ్రేక్.. కారణం ఏంటంటే..?

ద్రవిడ్ ప్రధాన కోచ్ గా విక్రమ్ రాథోర్ బ్యాటింగ్ కోచ్ గా టీమిండియాకు పని చేసి ఇటీవలే రాజీనామా చేశారు. మళ్ళీ ఆ ఇద్దరే అదే పాత్రల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టులో చేరడం విశేషం. వీరిద్దరి హయాంలో భారత్ టీ20 వరల్డ్ కప్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. రాథోర్ భారత్ తరపున ఆరు టెస్టులు.. ఏడు వన్డేలాడాడు. 33 ఫస్ట్ క్లాస్ సెంచరీలు అతని ఖాతాలో ఉన్నాయి. రాథోర్ 2019 నుండి 2023 వరకు టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా ఉన్నాడు. రిషబ్ పంత్, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ లాంటి ఆటగాళ్ల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాడు. 

విక్రమ్ రాథోర్ బ్యాటింగ్ కోచ్ గా నియమించడంపై ద్రవిడ్ స్పందించాడు. "చాలా సంవత్సరాలుగా విక్రమ్‌తో సన్నిహితంగా పని చేశాను. అతని సాంకేతిక నైపుణ్యం, ప్రశాంతమైన ప్రవర్తన, లోతైన అవగాహన  రాయల్స్‌కు సరిగ్గా సరిపోతాయని నేను నమ్మకంగా చెప్పగలను" అని ద్రవిడ్ అన్నాడు. 2023 ఐపీఎల్ రన్నరప్ గా నిలిచినా రాజస్థాన్ రాయల్స్ ఈ ఏడాది క్వాలిఫయర్ 2 మ్యాచ్ లో ఓడిపోయింది.