
న్యూఢిల్లీ: రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌కు జరిమానా పడింది. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించినందుకు అతని మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత విధించారు. మంగళవారం రాత్రి ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌తో శాంసన్ కొట్టిన షాట్‌ను హోప్ బౌండ్రీ లైన్ వద్ద క్యాచ్ పట్టాడు. కానీ బాల్ అందుకునే క్రమంలో హోప్ పాదం రోప్‌కు తగిలినట్లుగా భావించిన శాంసన్ ఆన్ ఫీల్డ్ అంపైర్లతో వాదనకు దిగాడు. కానీ థర్డ్ అంపైర్ ఔట్ ఇవ్వడంతో నిరాశగా వెనుదిరిగాడు.