ఐపీఎల్ లో భాగంగా నేడు రాజస్థాన్ రాయల్స్ తో లక్నో సూపర్ జయింట్స్ తలపడుతుంది. జైపూరు ఆతిధ్యమిస్తున్న ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇరు జట్లకు ఈ సీజన్ లో ఇదే తొలి మ్యాచ్. తొలి మ్యాచ్ లోనే గెలిచి ఇరు జట్లు బోణీ కొట్టాలని ఆరాటపడుతున్నాయి. లక్నో తరపున డికాక్, పూరన్, నవీన్ ఉల్ హక్, స్టోయినీస్ విదేశీ ప్లేయర్లుగా బరిలోకి దిగుతుంటే..రాజస్థాన్ తరపున బట్లర్, హెట్ మేయర్, బోల్ట్ ఆడుతున్నారు. ఈ మ్యాచ్ లో లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్ లో బరిలోకి దిగే అవకాశముంది.
లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI):
కెఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్, ఆయుష్ బడోని, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, నవీన్-ఉల్-హక్, యశ్ ఠాకూర్
రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI):
యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(కెప్టెన్, వికెట్ కీపర్), రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, సందీప్ శర్మ, అవేష్ ఖాన్, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్