
ఐపీఎల్ 2025 లో బుధవారం (ఏప్రిల్ 9) రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ తలబడనున్నాయి. అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోడీ స్టేడియంలో ప్రారంభమైన ఈ మ్యాచ్ కు రాజస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. రెండు జట్లు ఈ టోర్నీలో సూపర్ ఫామ్ లో ఉన్నాయి. గుజరాత్ ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉండగా.. నాలుగు మ్యాచ్ లో రెండు విజయాలతో రాజస్థాన్ ఏడో స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ ఒక మార్పుతో బరిలోకి దిగుతుంది. హసరంగా స్థానంలో ఫజల్ ఫరూఖీ ప్లేయింగ్ 11 లోకి వచ్చాడు. మరోవైపు గుజరాత్ ప్లేయింగ్ 11 లో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుంది.
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI):
సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ
రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI):
యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్, వికెట్ కీపర్), నితీష్ రాణా, రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, ఫజల్‌హాక్ ఫరూకీ, సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే