
ఐపీఎల్ 2025 లో రాజస్థాన్ రాయల్స్ సోమవారం (ఏప్రిల్ 28) అత్యంత కీలకమైన మ్యాచ్ ఆడబోతుంది. జైపూర్ వేదికగా ప్రారంభమైన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ తో అమీ తుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. గుజరాత్ టేబుల్ రెండో స్థానంలో ఉంటే..రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో 9 వ స్థానంలో ఉంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపుగా కోల్పోయిన రాజస్థాన్ ఈ మ్యాచ్ లో ఓడిపోతే అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. మరోవైపు ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్ ల్లో 6 విజయాలు సాధించిన గుజరాత్.. ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్ కు చేరువవుతుంది.
ప్లేయింగ్ 11 విషయానికి వస్తే గుజరాత్ ఈ మ్యాచ్ లో రషీద్ ఖాన్ ను పక్కన పెట్టింది. అతని స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ ఆల్ రౌండర్ కరీం జనత్ జట్టులోకి వచ్చాడు. రాజస్థాన్ రెండు మార్పులు చేసింది. ఫజల్ ఫారూఖీ స్థానంలో తీక్షణ.. తుషార్ దేశ్ పాండే స్థానములో యుద్ వీర్ సింగ్ ప్లేయింగ్ 11 లో స్థానం సంపాదించారు.
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI):
సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, కరీం జనత్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ
రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI):
యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, నితీష్ రాణా, రియాన్ పరాగ్ (కెప్టెన్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, సందీప్ శర్మ, యుధ్వీర్ సింగ్ చరక్