RR vs RCB: హాఫ్ సెంచరీతో రాణించిన జైశ్వాల్.. బెంగళూరు ముందు డీసెంట్ టార్గెట్

RR vs RCB: హాఫ్ సెంచరీతో రాణించిన జైశ్వాల్.. బెంగళూరు ముందు డీసెంట్ టార్గెట్

జైపూర్ లోని సవాయి మాన్సింగ్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ లో తడబడింది. అద్భుత ఆరంభం వచ్చినా ఆచితూచి ఆడడంతో భారీ స్కోర్ చేయలేకపోయింది. పిచ్ స్లో గా ఉండడంతో ఒక మాదిరి స్కోర్ కే పరిమితమైంది. ఓపెనర్ యశస్వి జైశ్వాల్ (47 బంతుల్లో 75:10 ఫోర్లు, 2 సిక్సర్లు) బాధ్యతగా ఆడి హాఫ్ సెంచరీ చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు మాత్రమే చేయగలిగింది. బెంగళూరు బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, యష్ దయాల్, హేజల్ వుడ్, కృనాల్ పాండ్య తలో వికెట్ తీసుకున్నారు.

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్ కు ఓపెనర్లు శాంసన్, జైశ్వాల్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. పవర్ ప్లే లో వికెట్ పడకుండా ఆచితూచి ఆడారు. తొలి వికెట్ కు 49 పరుగులు జోడించిన తర్వాత శాంసన్ (15) స్టంపౌటయ్యాడు. ఉన్నంత సేపు పరుగులు చేయడానికి ఇబ్బంది పడిన శాంసన్ 19 బంతుల్లో 15 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఆ తర్వాత పరాగ్ తో కలిసి జైశ్వాల్ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లాడు. రెండో వికెట్ కు 56 పరుగులు జోడించి మరో కీలక భాగస్వామ్యాన్ని నిర్మించారు. 30 పరుగులు చేసిన పరాగ్ స్కోర్ వేగాన్ని పెంచే క్రమంలో ఔటయ్యాడు. 

Also Read : మ్యాక్స్ వెల్‌పై అయ్యర్ ఫైర్

మరో ఎండ్ లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న జైశ్వాల్.. 75 పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు. చివర్లో ధృవ్ జురెల్ (35) బ్యాట్ ఝులిపించడంతో జట్టు స్కోర్ 170 పరుగుల మార్క్ అందుకుంది. చేతిలో వికెట్లు ఉన్నప్పటికీ రాజస్థాన్ వేగంగా ఆడడంలో విఫలమైంది. తొలి 10 ఓవర్లలో 77 పరుగులు చేసి పర్వాలేదనిపించిన రాజస్థాన్.. చివరి 10 ఓవర్లలో 96 పరుగులు రాబట్టింది.