RR: మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై రాజస్థాన్ రాయల్స్ సీరియస్.. జయ్దీప్ బిహానీపై చర్యలకు డిమాండ్

RR: మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై రాజస్థాన్ రాయల్స్ సీరియస్.. జయ్దీప్ బిహానీపై చర్యలకు డిమాండ్

మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై రాజస్థాన్ రాయల్స్ సీరియస్ అయ్యింది. తమపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ తీవ్రంగా పరిగణించింది. ఈ ఆరోపణలు చేసిన రాజస్థాన్ క్రికెట్ అకాడమీ (RCA) అడ్ హక్ కమిటీ కన్వీనర్ జయ్దీప్ బిహానీపై చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేసింది. లక్నోతో జరిగిన గెలవాల్సిన మ్యాచ్ లో కేవలం రెండు పరుగుల తేడాతో ఓడిపోవడంపై బిహానీ అనుమానం వ్యక్తం చేయడమే కాకుండా మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. చివరి ఓవర్లో 9 రన్స్ చేయాల్సిన టైమ్ లో సడెన్ గా ఢీలా పడి ఓటమికి గురి కావడం వెనుక ఫిక్సింగ్ ఉండొచ్చునని ఆరోపణలు చేశాడు. 

ఫిక్సింగ్ ఆరోపణలను తీవ్రంగా పరిగణించింది రాజస్థాన్ రాయల్స్. ఈ ఆరోపణలు ఫ్రాంచైజీ గౌరవంతో పాటు బీసీసీఐ విశ్వసనీయత దెబ్బతీసేలా ఉన్నాయని, రాజస్థాన్ స్పోర్ట్స్ కౌన్సిల్ గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని పేర్కొంది. నిరాధార ఆరోపణల వలన ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, దీనివలన రాజస్థాన్ స్పోర్ట్స్ అసోసియేషన్, రాయల్స్ ఫ్రాంఛైజీ, బీసీసీఐ వంటి గౌరవప్రదమైన సంస్థల రెప్యూటేషన్ దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేసింది. 

Also Read : సౌదీ గ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రి విన్నర్ పియాస్ట్రి

బీసీసీఐ కాంట్రాక్ట్ కు అనుగుణంగా స్టేట్ అసోసియేషన్, స్టేట్ గవర్నమెంట్ తో పనిచేయాల్సిన బాధ్యత తమపై ఉంటుందని తెలిపింది. రాయల్స్ 18 ఏళ్లుగా బీసీసీఐ సూచనల మేరకు, నిబంధనలను అనుసరించి విజయవంగంగా నడుస్తోందని తెలిపింది. జైపూర్ లో మ్యాచ్ ల నిర్వహణ హక్కులు రాజస్థాన్ స్టేట్ స్పోర్ట్స్ కౌన్సిల్ (RSSC )  కు ఉండేలా బీసీసీఐ ఆమోదించిందని, బీసీసీఐ, RSSC ల భాగస్వామ్యంతో ఐపీఎల్ సీజన్ ను సక్సెస్ చేసేందుకు  రాష్ట్రప్రభుత్వ సహకారంతో ముందుకు   వెళ్తోందని తెలిపింది. ఈ సందర్భంగా బిహానీపై కఠిన చర్యలు తీసుకోవాలని RSSC కి లేఖ రాసింది రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ.