RR vs PBKS: బ్యాటింగ్‎లో దుమ్మురేపిన జైశ్వాల్, పరాగ్.. పంజాబ్ ముందు భారీ టార్గెట్

RR vs PBKS: బ్యాటింగ్‎లో దుమ్మురేపిన జైశ్వాల్, పరాగ్.. పంజాబ్ ముందు భారీ టార్గెట్

ఐపీఎల్ 18లో భాగంగా పంజాబ్ కింగ్స్‎తో జరుగుతోన్న మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్స్ రాణించారు. పంజాబ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొని భారీ స్కోర్ చేశారు. లీగులో ఫామ్ లేమితో సతమతమవుతోన్న యంగ్ బ్యాటర్ యశస్వీ జైశ్వాల్ ఈ మ్యాచులో తిరిగి టచ్‎లోకి వచ్చాడు. పంజాబ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని 67 పరుగులు చేశాడు. ఆర్ఆర్ కెప్టెన్ శాంసన్ 38 పరుగులతో ఆకట్టుకోగా.. చివర్లో రియాన్ పరాగ్ (43) చెలరేగి ఆడాడు. దీంతో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ చేసింది. 

ఈ మ్యాచులో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‎కు దిగిన రాజస్థాన్ రాయల్స్‎కు ఆదిరిపోయే ఆరంభం దక్కింది. ఓపెనర్స్ యశస్వీ జైశ్వాల్, కెప్టెన్ సంజు శాంసన్ అద్భుతంగా రాణించారు. దీంతో ఆర్ఆర్ వికెట్ నష్టపోకుండా పవర్ ప్లేలో53 పరుగులు చేసింది. 26 బంతులు ఎదుర్కొన్న శాంసన్ 6 ఫోర్లు బాది 38 పరుగులు చేశాడు. వేగంగా ఆడే క్రమంలో ఫెర్గ్యూసన్ బౌలింగ్లో క్యాచ్ ఔట్ అయ్యాడు.

శాంసన్ ఔట్ అయిన మరో ఎండ్‎లో ఆచూతూచీ ఆడిన జైశ్వాల్ హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. ఈ క్రమంలోనే 67 పరుగుల వద్ద భారీ షాట్ ఆడబోయి ఫెర్గ్యూసన్ బౌలింగ్‎లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. చివర్లో రియాన్ పరాగ్ (43 నాటౌట్), హెట్మేయర్ (20), దృవ్ జురెల్ (13 నాటౌట్) రాణించడంతో ఆర్ఆర్ 205 పరుగల భారీ స్కోర్ చేసింది. పంజాబ్ బౌలర్లలో ఫెర్గ్యూసన్ 2, మార్కో జాన్‎సెన్, అర్షదీప్ సింగ్ చెరో వికెట్ తీశారు. అనంతరం 206 పరుగల భారీ లక్ష్యంతో పంజాబ్ ఛేదనకు దిగింది.