రాజస్థాన్ ప్లేయర్ల కేకలు.. ఫ్లైట్‌లో దట్టమైన పొగమంచు

IPL లో తొలి క్వాలిఫయర్ మ్యాచ్ ఆడేందుకు కోల్ కతా బయల్దేరిన రాజస్థాన్ రాయల్స్ బృందానికి ఛేదు అనుభవం ఎదురైంది. ఆర్ఆర్ బృందంతో బయల్దేరిన ప్రత్యేక విమానంలో కొంత సేపు గందరగోళం నెలకొంది. వాతావరణ మార్పుల కారణంగా విమానంలోకి ఒక్కసారిగా దట్టమైన పొంగమంచు చేరింది. దీంతో రాజస్థాన్ సభ్యులు భయాందోళనలకు గురయ్యారు. ఆర్ ఆర్ బృందంలోని ఓ వ్యక్తి.. విమానం దించాలంటూ గట్టిగా అరిచారు. కొద్దిసేపటి తర్వాత పొగమంచు క్లియర్ కావడంతో విమానంలో ఉన్నవారంతా ఊపిరిపీల్చుకున్నారు. చివరకు విమానం కోల్‌కతాలో సురక్షితంగా ల్యాండ్ అయింది. రాజస్థాన్ రాయల్స్ సభ్యులందరూ బైబై చెబుతూ విమానం నుంచి దిగారు. దీనికి సంబంధించిన వీడియో రాజస్థాన్ పోస్ట్ చేసింది. ప్రస్తుతం  ఈ వీడియోసోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మే 24న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో రాజస్థాన్ టేబుల్ టాపర్స్ అయిన గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్ చేరుతుంది.