ఐపీఎల్ 2024 రెండో రోజు వేలంలో రాజస్థాన్ రాయల్స్ అన్ క్యాప్డ్ ప్లేయర్ శుభమ్ దుబేను రూ. 5.8 కోట్లకు కొనుగోలు చేసింది. మొదట వెస్టిండీస్ కు చెందిన ప్లేయర్ రోవ్ మన్ పావెల్ ను రూ. 7.4కోట్లకు కొనుగోలు చేసిన తర్వాత రాజస్థాన్ రాయల్స్ ప్రారంభదశ వేలంలో చాలా స్తబ్దుగా కనిపించింది. అయితే అనూహ్యంగా భారత ప్లేయర్ శుభమ్ దుబేను రూ. 5.8 కోట్లతో దక్కించుకుంది. కేవలం 20 లక్షల మూలధన వేలంతో ఉన్న 29 యేళ్ల ఈ భారతీయ ఆటగాడిని రాజస్థాన్ రాయల్స్ ఎందుకు ఎంచుకుంది.. అసలు ఎవరీ శుభమ్ దుబే తెలుసుకుందాం.
శుభమ్ దుదే దేశవాళీ క్రికెట్ తన సత్తా చాటుకున్నాడు. దుబే మిడిల్ ఆర్డర్ లో శక్తివంతమైన పించ్ హిట్టర్.ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుతమైన ఫామ్ లో కనబర్చాడు. 29 ఏళ్ల దుబే విదర్భ తరపున 7 ఇన్నింగ్స్ లో 221 పరుగులు చేశాడు. 187.28 స్ట్రైక్ రేట్ తో టోర్నీమెంట్ లోజట్టు విజయానికి సాయం అందించాడు.
ఇక T20లో శుభమ్ దూబే 20 మ్యాచ్ లు అడాడు. 19 ఇన్నింగ్స్ లో 485పరుగులు చేశాడు. దూబె t20 కేరీర్ స్ట్రైక్ రేట్145.20.అయితే 37.30 సగటుతో పరుగులు చేశాడు. దూబే ఇప్పటివరకు ఏ IPLజట్టుకు ఆడలేదు. ఇండియన్ క్యాష్ రీచ్ లీగ్ లో రాయల్స్ అతని మొదటి జట్టు.
రాజస్థాన్ రాయల్స్ కొత్త జట్టు :
సంజు శాంసన్ (సి), జోస్ బట్లర్, షిమ్రాన్ హెట్ మేయర్, యశస్వీ జైస్వాల్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, డోనోవన్ ఫెరీరా, కునాల్ రాథోడ్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ సేన్, నవదీప్ సైనీ, ప్రసిద్ధ్ కృష్ణ, సందీప్ శర్మ,ట్రెంట్ బౌల్డ్, యుజ్వేంద్రచాహల్,, అడమ్ జంపా, అవేష్ ఖాన్, రోవ్ మన్ పావెల్(7.4 కోట్లు),శుభమ్ దుబే (5.80కోట్లు)