RR vs LSG: పూరన్, రాహుల్ శ్రమ వృధా.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ గెలుపు

RR vs LSG: పూరన్, రాహుల్ శ్రమ వృధా.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ గెలుపు

ఐపీఎల్ లో మరో థ్రిల్లింగ్ మ్యాచ్ నమోదయింది. లక్నో సూపర్ జయింట్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ నువ్వా నేనా అన్నట్లుగా సాగింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్ లో రాజస్థాన్ 20 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 16 ఓవర్ల ఓవర్ వరకు మ్యాచ్ లక్నో చేతిలో ఉన్నా.. సందీప్ శర్మ రావడంతో మ్యాచ్ రాజస్థాన్ వైపుకు మళ్లింది. పూరన్(64, 41 బంతుల్లో ), రాహుల్(58, 44 బంతుల్లో) అర్ధ సెంచరీలు చేసినా ఫలితం లేకుండా పోయింది.

 
పూరన్, రాహుల్ పోరాటం వృధా 

194 పరుగుల లక్ష్య ఛేదనలో లక్నో సూపర్ జయింట్స్ కు సరైన ఆరంభం లభించలేదు. బోల్ట్ విజ్రంభనతో 11 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో కెప్టెన్ రాహుల్ హుడా తో కలిసి 49 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. హుడా ఔట్ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన పూరన్ రాహుల్ తో కలిసి స్కోర్ బోర్డు ను పరుగులు పెట్టించాడు. ఐదో వికెట్ కు 85 పరుగులు జోడించి మ్యాచ్ ను గెలుపు దిశగా తీసుకుకెళ్లారు. ఈ క్రమంలో ఇద్దరూ తమ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నారు.అయితే చివర్లో ఒత్తిడి జయించలేక వరుసగా వికెట్లు పడడంతో రాజస్థాన్ ఈ మ్యాచ్ లో గెలుపు నమోదు చేసుకుంది. 

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 193 పరుగుల భారీ స్కోర్ చేసింది. సంజు శాంసన్ 52 బంతుల్లో 6 సిక్సులు, 3 ఫోర్లతో 82 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. పరాగ్ 43 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు.