RCB vs RR: బెంగళూరు బ్యాటింగ్..డూ ఆర్ డై మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టులో కీలక మార్పు!

RCB vs RR: బెంగళూరు బ్యాటింగ్..డూ ఆర్ డై మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టులో కీలక మార్పు!

ఐపీఎల్ 2025 లో గురువారం (ఏప్రిల్ 24) రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో రాజస్థాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ రాజస్థాన్ కు చావో రేవో లాంటిది. ఓడిపోతే ప్లే ఆఫ్స్ నుంచి అధికారికంగా నిష్క్రమిస్తుంది. మరోవైపు బెంగళూరు ఈ మ్యాచ్ గెలిస్తే ఆరో విజయాన్ని ఖాతాలో వేసుకొని ప్లే ఆఫ్స్ కు చెరువవుతుంది. బెంగళూరు ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుంది. మరోవైపు రాజస్థాన్ జట్టులో తీక్షన్ స్థానంలో ఫజల్ ఫారూఖీ ప్లేయింగ్ 11 లోకి వచ్చాడు.    

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI):

యశస్వి జైస్వాల్, శుభమ్ దూబే, నితీష్ రాణా, రియాన్ పరాగ్ (కెప్టెన్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, ఫజల్‌హాక్ ఫరూకీ, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI):

ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్(కెప్టెన్), దేవదత్ పడిక్కల్, జితేష్ శర్మ(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, యశ్ దయాల్