DC vs RR: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్.. మార్పులు లేకుండానే ఇరు జట్లు

DC vs RR: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్.. మార్పులు లేకుండానే ఇరు జట్లు

ఐపీఎల్ 2025లో బుధవారం (ఏప్రిల్ 16) ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మొదలైన ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ టోర్నీలో ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ ల్లో నాలుగు గెలిచింది. మరోవైపు రాజస్థాన్ ఆరు మ్యాచ్ ల్లో రెండు విజయాలు సాధించింది. ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఇరు జట్లు ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతున్నాయి.

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI):

యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్, వికెట్ కీపర్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, నితీష్ రాణా, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే


ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI):

జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, అభిషేక్ పోరెల్, కరుణ్ నాయర్, కెఎల్ రాహుల్(వికెట్ కీపర్), అక్షర్ పటేల్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ 

►ALSO READ | KKR vs PBKS: బాల్ పట్టుకొని బౌండరీకి విసిరాడు: ఆసీస్ క్రికెటర్‌పై నెట్టింట ట్రోల్స్