అధికారులు తమ చాదస్తాన్ని విద్యార్థులపైన చూపించడం ఈ మధ్య కామన్ అయిపోయింది. స్కూల్ కు వెళ్లే విద్యార్థులకు డ్రెస్ కోడ్ రూల్స్ పెట్టినట్లు ఎగ్జామ్ రాయటానికి కూడా డ్రెస్ కోడ్ నిబంధన పెట్టడం తీవ్ర వివాదాస్పదం అవుతోంది. రాజస్థాన్ స్టాఫ్ ససెలెక్షన్ కమీషన్ (RSSB) తీసుకున్న ఈ నిర్ణయం విమర్శల పాలవుతోంది. రాబోయే పరీక్షలకు విద్యార్థులు కుర్తా, పైజామా తో రావాలని ఆదేశించింది కమీషన్.
గతంలో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులను ఆభరణాలు, చైన్లు, జిప్పర్ ప్యాంట్లు, జాకెట్స్ వేససుకురావద్దనే నిబంధనలు పెట్టింది. పరీక్షల్లో చీటింగ్ చేససే అవకాశం ఉన్నందను ఈ నిబంధనలు పెట్టినట్లు తెలిపింది. ఈ నిబంధనలు ఎక్కడైనా ఉండేవే. కానీ కుర్తా పైజామా వేససుకురావాలనే నిబంధన విచిత్రంగా ఉందని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
కాంపిటీటివ్ ఎగ్జామ్స్ టైమ్ లో పేపర్ లీక్, చీటింగ్ ను అడ్డుకునేందుకే ఈ నిర్ణయం తీషసుకున్నట్లు RSSB ఛైర్మన్ అలోక్ రాజ్ తెలిపారు. విద్యార్థులు జీన్స్, జిప్పర్ ప్యాంట్లు, జాకెట్స్ వేసుకురాకుండా కుర్తా పైజామా తో పరీక్షలకు హాజరు కావాలని, నిబంధనలు పాటించకుంటే పరీక్షలకు అనుమతించేది లేదని చెప్పారు.
మెటల్ డిటెక్టర్ ద్వారా చెకింగ్ చేయడం జరుగుతుంది కాబట్టి.. మెటల్ జిప్పర్ ఉన్న బట్టలకు అనుమతి లేదని తెలిపారు.
RSSB నిర్ణయంపై అభ్యర్థులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. చలికాలం కారణంగా ఎవరైనా స్వెటర్లు, జీన్స్, జాకెట్స్ వేసుకొస్తారని, వీటిని నిషషేధించడం చాలా దారుణమని విద్యార్థులు అంటున్నారు.
పరీక్షల ప్రిపేరేషన్స్ కోసం ఇప్పటికే చాలా ఖర్చు చేశామని, స్టడీ మెటీరియల్, కోచింగ్, పెన్నులు, పేపర్లు వగైరా చాలా ఖర్చు చేశామని, మళ్లీ కుర్తా పైజామాలకు డబ్బులు ఎక్కణ్నుంచి తేవాలని ప్రశ్నిస్తున్నారు.