ములుగు మెడికల్ కాలేజీలో ఫస్ట్ అడ్మిషన్

ములుగు మెడికల్ కాలేజీలో ఫస్ట్ అడ్మిషన్
  • జాయిన్ అయిన రాజస్థాన్​కు చెందిన గౌరీ
  • అభినందించిన మంత్రి సీతక్క

ములుగు, వెలుగు: ములుగులోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఆలిండియాలో 23272వ ర్యాంక్ సాధించిన రాజస్థాన్ గంగానగర్ జిల్లాకు చెందిన విద్యార్థిని గౌరీ మొదటి అడ్మిషన్ తీసుకుంది. బుధవారం స్థానిక ఏరియా ఆస్పత్రిలోని ప్రిన్సిపల్ డాక్టర్ బి.మోహన్​ లాల్ అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేశారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర, ఎస్పీ శబరీశ్​మొదటి అడ్మిషన్​ పొందిన గౌరీని అభినందించారు. 

ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మొత్తం 50సీట్లు ఉండగా, ఆలిండియా ర్యాంక్ సాధించిన వారితో ఏడు సీట్లు భర్తీ అయ్యాయని, మిగిలిన 43సీట్లను తెలంగాణకు చెందిన విద్యార్థులతో భర్తీ చేయనున్నట్లు ప్రిన్సిపల్ మోహన్​లాల్ వెల్లడించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీజ, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగదీశ్​తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ములుగు జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్రవంతి ప్రైవేట్ ఆస్పత్రిని మంత్రి సీతక్క ప్రారంభించారు.