రెయిలెంగే కాపాడింది.. వంతెనపై ఇరుక్కున్న ఇద్దరు బైకర్స్..

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో నగరంలోని మోర్వానియా పట్టణంలోని ఒక వంతెనపై ఇద్దరు యువకులు తమ బైక్‌తో పాటు దాన్ని దాటేందుకు ప్రయత్నిస్తుండగా వంతెనపై ఇరుక్కుపోయారు. అనంతరం సివిల్‌ డిఫెన్స్‌ సిబ్బంది హైడ్రాలిక్‌ క్రేన్‌ సాయంతో వారిద్దరినీ రక్షించారు. అనంతరం వారి బైక్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.

ALSO READ :ఢిల్లీ-నోయిడా రోడ్లు జలమయం.. పాఠశాలలు బంద్

"25 నిమిషాల పాటు శ్రమించి, హైడ్రాలిక్ క్రేన్ సహాయంతో ఇద్దరు యువకులను సురక్షితంగా రక్షించాం. వారి బైక్ ని కూడా రికవరీ చేశాం. వారిద్దరూ స్థానికులని, వీడియో చిత్రీకరించడానికి అక్కడికి వెళ్లారని మాకు సమాచారం అందింది. అక్కడ ఉన్న రెయిలింగే వారిని కాపాడింది. ఆ తర్వాత వారిని రక్షించడానికి మేము అక్కడికి చేరుకున్నాము" అని కైవిల్ చెప్పారు.

#WATCH | Rajasthan | Two youths were stuck on a bridge in Morwaniya, Udaipur while trying to cross it on their motorcycle even when the nearby river swelled and overflowed due to incessant heavy rainfall. They were later rescued by Civil Defence with the help of a hydraulic… pic.twitter.com/TAIiTNzgOa

— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) July 26, 2023