ఎందుకు చేస్తున్నారో చెప్పండ్రా బాబూ : వందే భారత్ పై రాళ్ల దాడి.. పగిలిన కిటికీ అద్దాలు

ఎందుకు చేస్తున్నారో చెప్పండ్రా బాబూ : వందే భారత్ పై రాళ్ల దాడి.. పగిలిన కిటికీ అద్దాలు

దేశంలో వందేభారత్ రైళ్లపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.  ప్రజా రవాణాలో పెను మార్పులు తీసుకువస్తుందని భావిస్తున్న వందేభారత్ రైళ్లపై తరచూ రాళ్ల దాడులు జరగడంతో ప్రయాణికులు భయాంధోళనకు గురవుతున్నారు.

అసలు వందేభారత్ రైళ్ళనే  ఎందుకు దాడులు జరుగుతున్నాయి. ఇతర రైళ్లపై కాకుండా కేవలం వందేభారత్ రైళ్లనే టార్గెట్ చేయడం వెనుక వారి ఉద్దేశం ఏంటి? ఆకతాయిలు చేస్తున్నారా? లేదా ఎవరైనా  రాజకీయ కక్షలతో.. కావాలనే వందేభారత్ పై దాడులు చేయిస్తున్నారా అనేది  ప్రశ్నార్థకంగా మారింది.   

ఇటీవల గోరఖ్​పుర్​ నుంచి లక్నో వెళ్తున్న వందేభారత్​రైళ్లపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారు.  అలాగే అక్టోబర్ 2న  ఉదయ్‌పూర్--జైపూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో వెళ్తుండగా పట్టాలపై రాళ్లు పెట్టారు దుండగులు. అయితో సమయాస్ఫూర్తితో  డ్రైవర్ రైలును ఆపడంతో పెను ప్రమాదం తప్పింది.   లేటెస్ట్ గా రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాలో ఉదయ్‌పూర్ సిటీ-జైపూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై రాళ్లతో దాడి చేశారు.  దాని అద్దం పగిలిపోయింది.

అయితే ప్రయాణికులకు  ఎలాంటి గాయలు కాలేదని పోలీసులు తెలిపారు.  వందే భారత్ రైలు రాయల స్టేషన్  నుంచి వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు రైలుపై రాయి విసరడంతో  సీ7 కోచ్ కిటీకీ అద్దం పగిలిపోయిందని చిత్తోర్ ఘఢ్ జీఆర్పీ స్టేషన్ పోలీసులు తెలిపారు.  గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు .  ఇంకా ఎవరిని అరెస్ట్ చేయలేదని.. విచారిస్తున్నామని తెలిపారు.

ALSO READ: అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్​ పార్టీయే.. : దామోదర రాజనర్సింహ    

తరచూ జరుగుతుండటంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ రైళ్ల విషయంలో నిఘా పెంచాలని ఉన్నతాధికారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు

.