ఆర్‌‌‌‌సీబీ కెప్టెన్‌‌‌‌గా రజత్‌‌‌‌ పటీదార్‌‌‌‌

ఆర్‌‌‌‌సీబీ కెప్టెన్‌‌‌‌గా రజత్‌‌‌‌ పటీదార్‌‌‌‌

బెంగళూరు : ఐపీఎల్‌‌‌‌ ఫ్రాంచైజీ రాయల్‌‌‌‌ చాలెంజర్స్‌‌‌‌ బెంగళూరు తమ కొత్త కెప్టెన్‌‌‌‌గా రజత్‌‌‌‌ పటీదార్‌‌‌‌ను నియమించింది. ఈ మేరకు ఫ్యాఫ్‌‌‌‌ డుప్లెసిస్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో అతను బాధ్యతలు స్వీకరించనున్నాడు. గతేడాది నవంబర్‌‌‌‌లో జరిగిన మెగా ఆక్షన్‌‌‌‌కు ముందు రజత్‌‌‌‌ను రిటేన్‌‌‌‌ చేసుకున్న ఫ్రాంచైజీ ఎవరూ ఊహించని రీతిలో నాయకత్వ పగ్గాలు అప్పగించింది. 2022 నుంచి ఈ ఫ్రాంచైజీకి ఆడుతున్న 31 ఏళ్ల రజత్‌‌‌‌.. సయ్యద్‌‌‌‌ ముస్తాక్‌‌‌‌ అలీ ట్రోఫీ (టీ20), విజయ్‌‌‌‌ హజారే ట్రోఫీ (వన్డే)లో మధ్యప్రదేశ్‌‌‌‌ జట్టును నడిపించాడు. ‘రజత్‌‌‌‌ చాలా సింపుల్‌‌‌‌గా ఉంటాడు. టీమ్‌‌‌‌ గురించి ఎక్కువగా ఆలోచిస్తాడు. 

మధ్యప్రదేశ్‌‌‌‌ను ఎలా నడిపించాడో మేం చాలా దగ్గర్నించి చూశాం. అది మాకు నచ్చింది. అందుకే ఆర్‌‌‌‌సీబీ కెప్టెన్‌‌‌‌గా బాధ్యతలు అప్పగించాం’ అని ఆర్‌‌‌‌సీబీ చీఫ్‌‌‌‌ కోచ్‌‌‌‌ ఆండీ ఫ్లవర్‌‌‌‌ వెల్లడించాడు. డొమెస్టిక్‌‌‌‌ టీ20 క్రికెట్‌‌‌‌లో 10 మ్యాచ్‌‌‌‌లు ఆడిన రజత్‌‌‌‌ 61 యావరేజ్‌‌‌‌తో 428 రన్స్‌‌‌‌ చేశాడు. అతని స్ట్రైక్‌‌‌‌ రేట్‌‌‌‌ 186.08గా ఉంది. రజత్‌‌‌‌కు కెప్టెన్సీ ఇవ్వడంపై స్టార్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ విరాట్‌‌‌‌ కోహ్లీ సంతోషం వ్యక్తం చేశాడు.