ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు : రజత్ కుమార్

ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్. సోషల్ మీడియాపై ఫోకస్ పెట్టామని.. ఇప్పటివరకు కోడ్ ఆఫ్ కండక్ట్ కింద యాభైకి పైగా ఫిర్యాదులు వచ్చినట్లు చెప్పారు. బుధవారం వరకు 58 నామినేషన్ లు దాఖలైనట్లు తెలిపారు. ఈ నెల 25న లోక్ సభ ఎన్నికల ఓటర్ జాబితా ప్రకటిస్తామన్నారు రజత్ కుమార్. రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు ప్రచారం చేసే అభ్యర్థులు లౌడ్ స్పీకర్ వాడకూడదని తెలిపారు.