రాజ్​భవన్​ ఉద్యోగులకు మెడికల్​ చెకప్​

రాజ్​భవన్​ ఉద్యోగులకు మెడికల్​ చెకప్​
  • ప్రారంభించిన గవర్నర్​ జిష్ణుదేవ్​వర్మ 

పంజాగుట్ట, వెలుగు: రాజ్​భవన్​ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల కోసం గవర్నర్​ ఆఫీస్ మెగా మెడికల్ ​స్క్రీనింగ్​క్యాంప్​నిర్వహించింది. రాజ్​భవన్​ సంస్కృతి భవన్​లో  ఆదివారం నిర్వహించిన ఈ హెల్త్​ క్యాంప్​ను గవర్నర్​జిష్ణుదేవ్​వర్మ ప్రారంభించారు. కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్​హెల్త్​ సైన్స్, అల్లోపతి, ఆయుర్వేదిక్, డెంటల్​ డాక్టర్లు  వైద్య పరీక్షలు చేసి  ఉచితంగా మందులు అందజేశారు. గవర్నర్​ ప్రిన్సిపల్​ సెక్రటరీ బి.వెంకటేశ్​, జాయింట్​సెక్రటరీ భవాని శంకర్​పాల్గొన్నారు.