
రాజీవ్ కనకాల, ఝాన్సీ, ప్రజ్వల్ యాద, సైదమ్, అనిరుధ్, జ్యోతి కీలక పాత్రల్లో నటించిన వెట్సిరీస్ 'హోమ్ టౌన్', ఆహా ఓటీటీ వేదికగా ఏప్రిల్ 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఈ నేపథ్యంలో తాజాగా (మార్చి 10న) 'హోమ్ టౌన్' నుంచి టీజర్ రిలీజ్ చేశారు. మన ఇంటి చుట్టు అల్లుకున్న బంధాలు, చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసేలా ఉన్న టీజర్ నవ్వులు పూయిస్తోంది. ప్రసాద్ పాత్రలో రాజీవ్ తన పర్ ఫార్మెన్స్తో ప్రేక్షకుల్ని ఆకట్టుకోనున్నారు.
'కలలు ప్రారంభమయ్యే ప్రాంతం.. మొదటి ప్రేమను అనుభవించే చోటు.. ఎప్పటికీ నిలిచిపోయే స్నేహం' అంటూ విడదీయరాని స్నేహాలు, కుటుంబ విలువలు తెలిసేలా దీన్ని రూపొందించారు.
డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి పల్లే 'హోమ్ టౌన్' సిరీస్ ను తెరకెక్కించారు. నవీస్ మేడారం,శేఖర్ మేడారం నిర్మించారు. ఈ సిరీస్కు సినిమాటోగ్రా ఫర్గా దేవ్ దీప్ గాంధీ కుండు పనిచేయగా.. సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందించారు.
ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్ లకు ఉండే ఆ క్రేజే వేరు. అందులో ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబాల నేపథ్యంలో వచ్చే సిరీస్ లుకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతారు. అలా వచ్చిందే ‘#90s: ది మిడిల్ క్లాస్ బయోపిక్’.ఈ 'హోమ్ టౌన్' వెబ్ సిరీస్ సైతం ఇదే మాదిరిగా రాబోతుంది. ఎలాంటి హిట్ అందుకోనుందో చూడాలి.