బీఆర్​ఎస్​ నేతలు సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు: టీపీసీసీ చీఫ్​

బీఆర్​ఎస్​ నేతలు సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు: టీపీసీసీ చీఫ్​

చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ 34వ సద్భావన యాత్ర సంస్మరణ దినోత్సవం జరిగింది.  ఈ కార్యక్రమానికి రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర స్మారక కమిటీ అధ్యక్షుడు, రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జి. నిరంజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈకార్యక్రమంలో  టీపీసీసీ చీఫ్​ మహేష్​ కుమార్​ గౌడ్​ మాట్లాడుతూ.. దేశం కోసం గాంధీ కుటుంబం ప్రాణం త్యాగం చేసిందనన్నారు.  దేశ సమగ్రతకు ఇందిరాగాంధీ, రాజీవ్​ గాంధీ  ఎంతో కష్టపడ్డారని.. దేశంలో సాంకేతిక విప్లవాన్ని రాజీవ్​ గాంధీ తెచ్చారన్నారు. 

బీఆర్ఎస్​ నేతలు సంస్కారం లేకుండా మాట్లాడుతన్నారన్నారు. తెలంగాణ పేరుతో కేసీఆర్​ రాష్ట్రాన్ని దోచుకున్నారని టీపీసీసీ చీఫ్​ అన్నారు.  మూసీ ప్రక్షాళన విషయంలో బీఆర్​ఎస్​ రాజకీయం చేస్తుందన్నారు.

ALSO READ | అలాంటి భూములకు రైతు భరోసా ఇవ్వం: మంత్రి తుమ్మల

 ప్రస్తుతం బీజేపీ మతాలు.. కులా పేరుతో దేశాన్ని విచ్చిన్నం చేస్తుందన్నారు. నిజాం దూరదృష్టితో హైదరాబాద్​ సిటీని అభివృద్ది చేశారని టీపీసీసీ చీఫ్​ అన్నారు.  ప్రస్తుతం చినుకు పడితే నగరం అల్లకల్లోలం అవుతుందన్నారు. కంటిన్యూగా 3 గంటలు వర్షం పడితే నగరం మునిగిపోతుంది.నగరాన్ని కాపాడేందుకు సీఎం రేవంత్​ రెడ్డి హైడ్రా ఏర్పాటు చేశారన్నారు.