వరల్డ్ కప్ వేదికల్లో రాజకీయ జోక్యం లేదు: బీసీసీఐ ఉపాధ్యక్షుడు

వరల్డ్ కప్ వేదికల్లో రాజకీయ జోక్యం లేదు: బీసీసీఐ ఉపాధ్యక్షుడు

వరల్డ్ కప్ వేదికలను కొన్ని నగరాలకే పరిమితం చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఒక్కో స్టేడియానికి నాలుగైదు మ్యాచులు కేటాయించడానికి బదులు.. అవకాశం రాని వేదికలపై ఒక మ్యాచ్ అయినా ఆడించి ఉంటే బాగుండేది కదా అన్న మాటలు వినపడుతున్నాయి. ఈ క్రమంలో పంజాబ్ క్రీడల మంత్రి గుర్మీత్ సింగ్‌ చేసిన వ్యాఖ్యలకు.. బీసీసీఐ వర్గాలు అదే స్థాయిలో  కౌంటర్ ఇస్తున్నాయి.  

Punjab Sports Minister Gurmeet Singh Meet Hayer condemns the exclusion of Mohali from the list of cities to host the ICC Cricket World Cup-2023

"The exclusion of Punjab's Mohali from the list of host cities for the tournament was due to political interference. Punjab government… pic.twitter.com/R7RVCejMfE

— ANI (@ANI) June 27, 2023

వరల్డ్ కప్-2023 మ్యాచులకు ఆతిథ్యమిచ్చే నగరాల జాబితా నుండి మొహాలీని మినహాయించడాన్ని తప్పుబట్టిన గుర్మీత్ సింగ్‌.. రాజకీయ జోక్యం కారణంగానే ఇది సాధ్యమైందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా అదే స్థాయిలో స్పందించారు. ఐసీసీ ప్రమాణాలకు మొహాలీ వేదిక సరితూగలేదని, అందుకే అవకాశం కల్పించలేకపోయినట్లు వెల్లడించారు.

"వరల్డ్ కప్ మ్యాచుల కోసం తొలిసారి 12 వేదికలను ఎంపిక చేశాం. సౌత్‌ జోన్‌ నుంచి నాలుగు, సెంట్రల్‌ జోన్‌ నుంచి ఒకటి, వెస్ట్‌ జోన్ నుంచి రెండు, నార్త్‌ జోన్ నుంచి రెండు ఎంపిక చేశాం. అలాగే ఢిల్లీ, ధర్మశాలకు అవకాశం కల్పించాం. ఇందులో చాలా వేదికలు గతంలో వరల్డ్ కప్ మ్యాచులకు ఎంపిక కాలేదు. అది కూడా గమనించాలి. వాటికున్న వసతులు, ప్రమాణాల వల్లే ఈ అవకాశం దక్కింది." 

"వేదికల ఎంపికపై ఎలాంటి వివక్షత లేదు. ద్వైపాక్షిక సిరీస్‌ మ్యాచులను మొహాలీ వేదికగా చాలా నిర్వహించాం. ఇంకా జరుగుతాయి కూడాను. అంతెందుకు విరాట్ కోహ్లీ 100వ టెస్టు మ్యాచ్‌ కూడా మొహాలీ వేదికగానే జరిగింది. మొహాలీ స్టేడియం ఐసీసీ ప్రమాణాలకు తగ్గట్టుగా లేదు. అందుకే ఈసారి అవకాశం రాలేదు.." అని రాజీవ్ శుక్లా వెల్లడించారు.

#WATCH | ..."ICC has to approve all the venues, it is not purely in BCCI's hands. So, all those who're objecting should realise that we need consent of ICC also while choosing these venues": Rajeev Shukla, Vice-President, BCCI on ICC Cricket World Cup-2023 pic.twitter.com/2ImI3yi5bA

— ANI (@ANI) June 27, 2023

పేరుకే 12 వేదికలు.. 

రాజీవ్ శుక్లా చెప్పినది వాస్తవమే అయినా.. 12 వేదికల్లో రెండింటిని వార్మప్‌ మ్యాచులకే పరిమితం చేయడాన్ని గమనించాలి. తిరువనంతపురం, గువాహటి వేదికగా వార్మప్‌ మ్యాచులు జరగనుండగా.. మిగతా పదింటిలో లీగ్‌ మ్యాచులు, నాకౌట్‌ మ్యాచులు జరగనున్నాయి.