నయీంనగర్ నాలా పనులు పూర్తి చేయాలి : నాయిని రాజేందర్ రెడ్డి

హనుమకొండ సిటీ,వెలుగు :  హనుమకొండ లోని నయీంనగర్​ నాలా పనులను పూర్తి చేసి వచ్చే వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని వరంగల్ పశ్చిమ   ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కోరారు. శనివారం నయీంనగర్ నాలా ప్రాంతాన్ని పరిశీలించారు. గతంలో నాలాకు అడ్డు గా ఉన్న అక్రమ కట్టడాలను కూల్చి వేశామన్నారు.  నాలా విస్తరణ పనులను పూర్తి చేసి వరద తో జనాలకు ఎలాంటి  ఇబ్బందులు తలెత్తకుండా,  ముంపు గురికాకుండా చూసుకోవాలన్నారు.