
వరంగల్/హనుమకొండ/జనగామ/భూపాలపల్లి, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శనివారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో 17 నామినేషన్లు వచ్చాయి. వరంగల్ పశ్చిమలో కాంగ్రెస్ క్యాండిడేట్ నాయిని రాజేందర్‌రెడ్డి రెండు సెట్ల నామినేషన్లు వేశారు. అలాగే వరంగల్ తూర్పులో ఆప్ తరఫున త్రిపురోజు రవికుమార్, ఇండిపెండెంట్‍గా కొత్తగట్టు రవి నామినేషన్లను రిటర్నింగ్ ఆఫీసర్‌కు అందజేశారు. నర్సంపేటలో ముస్కే అమర్, నూనె అనిల్‌కుమార్, బి. సురేశ్, వర్ధన్నపేటలో ఏఐఎఫ్‍బీ తరఫున ఇసంపెల్లి వేణు, ఇండిపెండెంట్‌గా శ్రీనేనా ప్రేమ్ రెడిరిపిక, పరకాల నుంచి ఇండిపెండెంట్‌గా అబ్బాడి బుచ్చిరెడ్డి, గణిపాక కోర్నెల్, అందె కుమారస్వామి, ఉల్లెంగల అశోక్ పవన్ నామినేషన్లు వేశారు. అలాగే జనగామలో చేగూరి అంజయ్య, స్టేషన్‌ఘన్‌పూర్‌లో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున మారపాక రమేశ్, పాలకుర్తిలో బాదం సృజనారెడ్డి నామినేషన్లు వేశారు. అలాగే భూపాలపల్లిలో ఎంసీపీఐ (యూ) తరఫున మహ్మద్ అశ్రఫ్ నామినేషన్ వేశారు. మహబూబాబాద్, డోర్నకల్, ములుగులో శనివారం ఒక్క నామినేషన్ కూడా రాలేదు.