కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ : కండువా కప్పి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం ( జులై 12) సాయంత్రం ప్రకాష్ గౌడ్ అనుచరులతోపాటు మునిసిపల్ చైర్మన్, కార్పొరేట్లర్లు, ఎంపీపీలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకాష్ గౌడ్ కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పటివరకు 8మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నట్లు సమాచారం.

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పలువురు బీఆర్‌ఎస్‌ నేతలు ఆ పార్టీని వీడారు. మాజీ మంత్రి దానం నాగేందర్‌, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, ఎంపీలు రంజిత్ రెడ్డి, పసునూరి దయాకర్‌, పోచారం శ్రీనివాసరెడ్డి వంటి వారు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో జడ్పీ ఛైర్మన్ పీఠాలు, మునిసిపల్ పీఠాలు కాంగ్రెస్ వశమయ్యాయి. జిల్లా స్థాయి నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.

ALSO READ | రేవంత్ పదేండ్లు అధికారంలో ఉంటడు:ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్