రాజేంద్రనగర్ నియోజకవర్గంలో MLA వర్సెస్ MP రాజకీయాలు

రాజేంద్రనగర్ నియోజకవర్గంలో MLA వర్సెస్ MP రాజకీయాలు

రాజేంద్రనగర్ నియోజకవర్గంలో MLA వర్సెస్ MP రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయి. సిట్టింగ్ MLA ప్రకాష్ గౌడ్ టికెట్ కు చేవెళ్ల MP రంజిత్ రెడ్డి ఎసరు పెట్టారనే చర్చ నడుస్తోంది. ఎంపీ రంజిత్ రెడ్డి ఈసారి రాజేంద్రనగర్ MLA టికెట్ ఆశిస్తున్నట్టు సమాచారం. నియోజకవర్గంలో సభలు, సమావేశాలు పెడుతూ..పార్టీ పెద్దలతో లైన్ క్లియర్ చేయించుకునే పనిలో ఉన్నారట రంజిత్ రెడ్డి.

MP రంజిత్ రెడ్డి స్థానిక ఎంపీ కావడంతో..నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. MP నిధులతో అభివృద్ధి పనులు చేస్తూ..నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. ఇదంతా ఎమ్మెల్యే సీటు టార్గెట్ గానే రంజిత్ రెడ్డి పావులు కదుపుతున్నారని టాక్. MIMతో ఎమ్మెల్యేని టార్గెట్ చేయిస్తున్నట్టు టాక్. తనతో క్లోజ్ గా ఉండే నేతలతోనూ ప్రకాష్ గౌడ్ టార్గెట్ గా వ్యవహారాల్ని నడిపిస్తున్నారంట ఎంపీ.

రాజేంద్రనగర్ నియోజక వర్గంలో నియోజక వర్గంలో MIM ప్రభావం ఎక్కువే. గెలుపు ఓటములను ముస్లిం మైనార్టీ ఓట్లే ప్రభావితం చేస్తాయి. తన టికెట్ కోసం MIM నుంచి నరుక్కుంటు వస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రకాష్ గౌడ్ కు BRS టికెట్ ఇస్తే..తమ పార్టీ అభ్యర్థిని బరిలో పెడతామని MIM పెద్దలతో ఎంపీయే చెప్పించారనే చర్చ నడుస్తోంది. రంజిత్ రెడ్డికి టికెట్ ఇస్తే సహకరిస్తామని MIMతో BRS పెద్దలకు చెప్పించేలా వ్యవహారం నడిపించినట్టు డిస్కషన్ జరుగుతోంది.

రాజేంద్రనగర్ లో ఎంపీ రంజిత్ రెడ్డికి మద్దతుగా..కార్తిక్ రెడ్డిని మంత్రి సబితానే రంగంలోకి దింపినట్టు టాక్. వచ్చే ఎన్నికల్లో రాజేంద్ర నగర్ నుంచి పోటీ చేస్తానని కార్తిక్ రెడ్డి ప్రకటించారు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా అంతే తీవ్రంగా స్పందించారు. దమ్ముంటే KCR, KTR నుంచి టికెట్ తెచ్చుకోవాలని సవాల్ చేశారు. ప్రకాష్ గౌడ్, MIM మధ్య పెరిగిన దూరాన్ని..వాడుకోవాలని ప్రత్యర్థులు స్కెచ్ వేసినట్లుగా కనిపిస్తోంది. MLAప్రకాష్ గౌడ్ వర్సెస్ MPరంజిత్ రెడ్డి మధ్యలో MIM అన్నట్లుగా తయారైంది రాజేంద్ర నగర్ నియోజకవర్గం పరిష్టితి.