రేయ్ వార్నర్.. బీ వార్నింగ్ : రాజేంద్రప్రసాద్ కామెంట్లపై రచ్చ రచ్చ

రేయ్ వార్నర్.. బీ వార్నింగ్ : రాజేంద్రప్రసాద్ కామెంట్లపై రచ్చ రచ్చ

నితిన్ రాబిన్‍హుడ్ మూవీలో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ (David Warner) క్యామియో రోల్ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల (మార్చి 28న) సినిమా విడుదల కానున్న నేపథ్యంలో (మార్చి 23న) ప్రీ-రిలీజ్ ఈవెంట్‍ నిర్వహించారు మేకర్స్.

ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు వార్నర్ హాజరయ్యారు. అయితే, ఈ ఫంక్షన్లో నటుడు రాజేంద్రప్రసాద్, క్రికెటర్ డేవిడ్ వార్నర్పై అభ్యంతకరమైన కామెంట్లు చేశారు. రాజేంద్రప్రసాద్ మాట్లాడిన మాటలు ఆయన ఫ్యాన్స్కు కోపం తెప్పిస్తున్నాయి. 

Also Read : నాని, శ్రీనిధి శెట్టిల రొమాంటిక్ మెలోడీ రిలీజ్

ఈవెంట్‍లో రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) మాట్లాడుతూ.. " మా డైరెక్టర్ వెంకీ కుడుముల, హీరో నితిన్ కలిసి డేవిడ్ వార్నర్ను తీసుకొచ్చారు. ఆయన క్రికెట్ ఆడవయ్యా అంటే, పుష్ప స్టెప్స్ వేశాడు. దొంగ ము**కొడుకు.. వీడు మామూలోడు కాదు. రేయ్ వార్నరూ ..బీ వార్నింగ్ " అని మాట్లాడారు రాజేంద్రప్రసాద్. ఇపుడీ ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

అనుభవం ఉన్న నటులు తమ స్థాయిని మరిచిపోయి, తమకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎలా నడుస్తుంది? 'ఒక అంతర్జీతీయ స్థాయి క్రికెటర్ ను పట్టుకుని ఇలా ఏ విధంగా మాట్లాడిన చెల్లుతుందని అనుకుంటే సరిపోద్దా? కాస్తా ముందు వెనుక ఆలోచించి, మాటలు పరిధులు దాటకుండా చూసుకుంటే బాగుంటుందని' నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

అంతేకాకుండా, సినిమాలపై ఫ్యాషన్తో ఒక విదేశీ స్టార్ క్రికెటర్, మన తెలుగు సినిమాలో నటిస్తున్నాడని ఆనందపడాల్సింది పోయి, ఇలా పొగిడినట్లే పొగిడి బూతు మాటలతో తిట్టడం ఏ మాత్రం సరికాదంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై వార్నర్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సినీ ప్రేక్షకులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. ఇది మరింత ముదరక ముందే, నటుడు రాజేంద్రప్రసాద్ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకుంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. 

ఈ ఈవెంట్‍లో నితిన్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా విషయంలో చాలా కాన్ఫిడెంట్‌‌గా ఉన్నాం. శ్రీలీలతో హిట్ పెయిర్‌‌‌‌గా పేరొస్తుందని నమ్ముతున్నా. ఇదిదా సర్‌‌‌‌ప్రైజ్ సాంగ్‌‌తో కేతిక శర్మ ఇంప్రెస్ చేస్తుంది. వెంకీతో ఇది రెండో సినిమా. డేవిడ్ వార్నర్ పాత్ర చిన్నదైనా చాలా ఇంపాక్ట్ ఉంటుంది.  మైత్రీ బ్యానర్‌‌‌‌లో వర్క్ చేయడం హ్యాపీ’అని అన్నాడు. రాబిన్‍హుడ్ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది.

  • Beta
Beta feature
  • Beta
Beta feature