
సాయి రోనక్, ప్రగ్యా నగ్రా జంటగా రమేష్ చెప్పాల దర్శకత్వంలో వేణుగోపాల్‌రెడ్డి నిర్మించిన చిత్రం ‘లగ్గం’. ఈ చిత్రంలో రోహిణి, సప్తగిరి, ఎల్.బి. శ్రీరామ్, కృష్ణుడు, రఘుబాబు, రచ్చ రవి ఇతర పాత్రలు పోషించగా, చరణ్ అర్జున్ సంగీతం అందించాడు. అక్టోబర్ 25న సినిమా విడుదల కానుంది.
ఇటీవలే ఈ మూవీ ట్రైలర్‌ను ఒరిజినల్‌గా లగ్గం చేసుకుంటున్న నూతన వధూవరులతో రిలీజ్ చేయించారు మేకర్స్. ట్రైలర్ విషయానికొస్తే.. ఇందులో కీలక పాత్ర పోషించిన రాజేంద్ర ప్రసాద్‌కి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ అంటే మక్కువ ఎక్కువ. అందుకే వాళ్ల ఊరిలో అందరికీ సాఫ్ట్‌వేర్ అల్లుళ్లను తీసుకొస్తా అంటాడు.
ALSO READ : అన్ స్టాపబుల్ సీజన్ 4.. దెబ్బకి థింకింగ్ మారాలంటున్న బాలకృష్ణ
అయితే ఓ సమస్య కారణంగా హీరో హీరోయిన్ల పెళ్లి ఆగిపోతుంది. ‘లగ్గం అంటే రెండు కుటుంబాలు కలవడం కాదు.. ఇద్దరు మనసులు కలవడం’ అని రాజేంద్ర ప్రసాద్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటుంది.