ఏపీలో రూ. 10 వేల ఇస్తే ..తెలంగాణలో రూ. 7వేలే..

ఏపీలో రూ. 10 వేల ఇస్తే ..తెలంగాణలో రూ. 7వేలే..

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ఆందోళకు దిగారు.  పీజీ ఆండ్ పీహెచ్ డీ విద్యార్థులు కళాశాల గేటు ముందు నిరసన చేపట్టారు. కొత్త నిబంధనల అమలుతో చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 


పరిశోధనకు కనీస సౌకర్యాలు కల్పించకుండా రిసెర్చ్ పేపర్ ను సబ్మిట్ చేయాలని నిబంధనను కొత్తగా విధించారని విద్యార్థులు తెలిపారు. దీని కారణంగా తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. పరిశోధనలకు ఎలాంటి సౌకర్యాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ ఆర్టికల్చర్ విద్యాభ్యాసం తమకు శాపంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల సైఫండ్ సైతం అంతంత మాత్రంగానే ఉందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో రూ. 10వేల సైఫండ్ ఇస్తే.. తెలంగాణలో కనీసం రూ.  7వేలు కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.

ALSO READ:ICC ODI World Cup 2023: సెమీస్ చేరే నాలుగు జట్లు ఇవే: మాజీ ఓపెనర్ జోస్యం