చేతిలో రూపాయి లేకుండా కార్పొరేటర్ బరిలోకి

చేతిలో రూపాయి లేకుండా కార్పొరేటర్ బరిలోకి

జీహెచ్ఎంసీలో ఎన్నికల హడావుడి మామూలుగా లేదు. టికెట్లు తెచ్చుకున్న వారు తమతమ డివిజన్‌లలో ప్రచారంతో ముందుకెళ్తున్నారు. టికెట్లు దక్కనివారికి పార్టీ పెద్దలు నచ్చచెబుతున్నారు. ఎన్నికల బరిలో నిలిచిన వారిలో ధనవంతులున్నారు, ధనం లేని వారూ ఉన్నారు. అభ్యర్థుల నుంచి వచ్చిన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులు పరిశీలించారు. వాటిలో అభ్యర్థులు తమ చదువులు, ఆస్తులు, మరియు కుటుంబ వివరాలు వెల్లడించారు. అయితే ఒక అభ్యర్థి నామినేషన్ పత్రాలను చూసిన రిటర్నింగ్ అధికారులు షాక్ అయ్యారు. రాజేంద్రనగర్ నుంచి తెలుగుదేశం తరపున కార్పొరేటర్ అభ్యర్థిగా ఎన్. రోజా బరిలోకి దిగుతుంది. అయితే ఆమె సమర్పించిన నామినేషన్ పత్రాల్లో ఆమె పేరు మీద ఎటువంటి స్థిర, చర ఆస్తులు లేనట్లు వెల్లడించింది. అంతేకాకుండా ఆమె బ్యాంకు ఖాతాలో రూపాయి నగదు కూడా లేనట్లు తెలిపింది. అది చూసిన ఎన్నికల అధికారులు అవాక్కయ్యారు. రూపాయి లేకుండా కూడా ఎన్నికలలో పోటీ చేసేవారు ఉంటారా అని అటు అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

For More News..

తెలంగాణలో మరో 873 కరోనా కేసులు

ప్రచారానికి పోతే రూ.1000, బిర్యానీ ప్యాకెట్

కరోనా మరణాల కట్టడికి కొత్త ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌కు కనుగొన్న తెలంగాణ సైంటిస్ట్