మస్తాన్ సాయి కస్టడీకి అనుమతించిన రాజేంద్రనగర్ కోర్టు

మస్తాన్ సాయి కస్టడీకి అనుమతించిన రాజేంద్రనగర్ కోర్టు

రాజ్ తరుణ్, లావణ్య వివాదంలో కీలక నిందితుడు మస్తాన్ సాయి కస్టడీకి కోర్టు అనుమతించింది.  మస్తాన్ సాయిని 2025 ఫిబ్రవరి 3 న అరెస్టు చేసిన  నార్సింగ్ పోలీసులు.. 5 రోజుల కస్టడీ కోరుతూ పిటిషన్ వేశారు. ఇవాళ (ఫిబ్రవరి 10) పిటిషన్ ను విచారించిన హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ కోర్టు 2 రోజుల కస్టడీ కి అనుమతించింది. 

ఫిబ్రవరి 13 నుండి 15 వరకు కస్టడీలోకి తీసుకోవచ్చునని సూచించింది కోర్టు.  ఫిబ్రవరి13 తేదీన మస్తాన్ సాయినీ విచారణ చేయనున్నారు పోలీసులు.

లావణ్య రాజ్ తరుణ్ ల వివాదం ఆ మధ్య టాలీవుడ్ లో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. గతంలో లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం ( ఫిబ్రవరి 3, 2025 ) మస్తాన్ సాయిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రాజ్ తరుణ్ తనతో విడిపోవడానికి కారణం మస్తాన్ సాయి అని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది లావణ్య .

Also Read :- చిలుకూరు అర్చకులు రంగరాజన్కు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్

పలువురు అమ్మాయిలతో ప్రైవేట్ గా ఉన్న సమయంలో వీడియోలు రికార్డ్ చేసినట్లు మస్తాన్ సాయిపై ఆరోపణలు ఉన్నాయి.ప్రైవేట్ గా గడిపిన వీడియోలతో మస్తాన్ సాయి బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నట్లు గుర్తించారు పోలీసులు. తనకు చెందిన కొన్ని వీడియోలను   మస్తాన్ సాయి రికార్డ్ చేశాడని పేర్కొన్న లావణ్య..  వీడియోలను పోలీసులకు అందజేసింది. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో 200 వీడియోలకు పైగా ఉన్నట్లు గుర్తించారు పోలీసులు.

గతంలో వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు మస్తాన్ సాయి. అంతే కాకుండా గతంలో ఏపీలో కూడా డ్రగ్స్ కేసులో మస్తాన్ సాయిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.