
- తలసేమియా బాధితుల కోసం బ్లడ్ డొనేట్ చేయాలి
- రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి
శంకర్పల్లి, వెలుగు : తలసేమియా బాధితుల కోసం బ్లడ్ డొనేట్ చేసేందుకు యువత ముందుకు రావాలని రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. ‘పోలీస్ అమర వీరుల దినం’ సందర్భంగా శుక్రవారం రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి టౌన్లో పోలీసులు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయగా.. విశేష స్పందన లభించింది. సుమారు 90 మంది యువకులు బ్లడ్ డొనేట్ చేశారు.
చీఫ్ గెస్టుగా హాజరైన డీసీపీ జగదీశ్వర్ రెడ్డి వారికి సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం డీసీపీ మాట్లాడుతూ.. దాతల నుంచి సేకరించిన బ్లడ్ ను తలసేమియా బాధితులకు అందిస్తామన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ రష్మీ పెరుమాళ్, ఏసీపీ లక్ష్మినారాయణ, సీఐ వినాయక్ రెడ్డి, ఎస్సై సంతోశ్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.