అక్రమంగా నిర్మిస్తే కూల్చేస్తాం. . . రాజేంద్రనగర్​ ఫుట్​పాత్​లపై దుకాణాలు తొలగింపు

హైదరాబాద్​ ఫుట్​పాత్​లపై ఉన్న షాపులను అధికారులు తొలగిస్తున్నారు.  రాజేంద్రనగర్​ సర్కిల్​ శాస్త్రీపురంలో ఫుట్​ పాత్​లపై వెలిసిన కట్టడాలను జీహెచ్​ఎంసీ టౌన్​ ప్లానింగ్​ అధికారులు తొలగిస్తున్నారు.  రోడ్డుకు ఇరువైపులా ఫుట్​ పాత్​లపై వెలసిన కట్టడాలను కూల్చివేశారు.  వ్యాపారస్తులు రోడ్డుకు ఇరువైపులా స్థలాన్ని ఆక్రమించి బిజినెస్​ చేసుకుంటున్నారు. ఫుట్​ పాత్​ను కబ్జా చేయడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. సాయంత్రం వేళల్లో గంటల తరబడి ట్రాఫిక్​ జాం కావడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఫుట్​ పాత్​లను తొలగగిస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు.  దీంతో పోలీస్ బందోబస్తుతో కూల్చివేతల పర్వాన్ని కొనసాగిస్తున్నారు,  గతంలో జీహెచ్​ఎంసీ సిబ్బంది పలుమార్లు వ్యాపారసముదాయాలను.. షాపులను తొలగించాలని హెచ్చరించారు.   రాజేంద్రనగర్GHMC మున్సిపల్  కమిషనరేట్ పరిధిలో  అక్రమంగా వెలిసిన కట్టడాలను డబ్బాలను.. ఉపేక్షించేది లేదని  రాజేంద్రనగర్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్ అన్నారు..