
గండిపేట, వెలుగు: ఇంట్లోకి చోరబడి బంగారు, వెండి, నగదు ఎత్తుకెళ్లిన ఆరుగురు నిందితులను రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను డీసీపీ తన కార్యాలయంలో శనివారం వెల్లడించారు. ఈ నెల 21న సన్‌సిటీ పీఅండ్‌టీ కాలనీలో నివాసం ఉంటున్న మహ్మద్ షకీర్ అలీ ఇంట్లోకి గుర్తు తెలియని నలుగురు నిందితులు తలుపు తట్టి, బలవంతంగా లోపలికి చొరబడ్డారు. అనంతరం దంపతులిద్దరిని కత్తితో బెదిరించి, బీరువాలోని బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదు, రెండు మొబైల్ ఫోన్‌లు ఎత్తుకెళ్లారు.
బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. నిందితులను మైలార్‌దేవ్‌పల్లికి చెందిన జిబ్రాన్ బిన్ జాబర్, కార్వాన్‌కు చెందిన మహ్మద్ అకీల్, హూమాయన్‌నగర్‌కు చెందిన ఫసియుద్దీన్, వట్టేపల్లికి చెందిన సోహైల్, సైఫీ కాలనీకి చెందిన అబ్దుల్ రబీ జావీద్, కలపత్తర్‌కు చెందిన షబ్బీర్ గా గుర్తించారు. జిబ్రాన్ బిన్ జాబర్ బాధితులకు బంధువు కావడంతో పక్కా ప్లాన్ప్రకారం చోరీకి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. చోరీ చేసిన సొత్తుతో పాటు ఓ కారును స్వాధీనం చేసుకున్నారు.