హైదరాబాద్సిటీ/గండిపేట, వెలుగు: వేసవిలో ఓఆర్ఆర్ పరిధిలో తాగునీటి సమస్యకు చెక్పెట్టేందుకు, కొత్తగా ఏర్పడిన కాలనీలకు సరిపడా నీటిని అందించేందుకు మెట్రో వాటర్బోర్డు ముందస్తు ప్లాన్చేస్తోంది. ఇందులో భాగంగా రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో కొత్తగా మూడు రిజర్వాయర్లను నిర్మించింది. వాటిని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి శ్రీధర్ బాబు గురువారం ప్రారంభించారు.
వీటితోపాటు హిమాయత్ సాగర్, బుద్వేల్, గండిపేటలో నిర్మించిన11ఎంఎల్డీల మూడు ప్రెషర్ ఫిల్టర్లను స్టార్ట్చేశారు. అలాగే జంట జలాశయాల నీటిని శుద్ధి చేసి పాతబస్తీతోపాటు మరికొన్ని ప్రాంతాలకు సరఫరా చేసేందుకు ఆయా ప్రాంతాల్లో నిర్మించిన మినీ ట్రీట్మెంట్ప్లాంట్లను కూడా ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బేగ్, వాటర్బోర్డు ఎండీ అశోక్ రెడ్డి, ప్రాజెక్టు డైరెక్టర్లు సుదర్శన్, శ్రీధర్, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.