ఎమ్మెల్యే విఠల్​రెడ్డికి బీఫాం ​ఇస్తే ఓటమి ఖాయం : రాజేశ్ బాబు

  • ఆయనకు ఇస్తే మేం సపోర్ట్​ చేయం
  • బీఆర్​ఎస్​ అసమ్మతి నేతల వెల్లడి

భైంసా, వెలుగు: ముథోల్​ఎమ్మెల్యే విఠల్​ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ బీఫాం ఇవ్వొద్దని, ఇస్తే ఓటమి ఖాయమని ఆ పార్టీ అసమ్మతి నేత, వ్యవసాయ మార్కెట్​కమిటీ చైర్మన్​ రాజేశ్ బాబు విజ్ఞప్తి చేశారు. శనివారం భైంసాలో ప్రెస్​మీట్​నిర్వహించి మాట్లాడారు. విఠల్​ రెడ్డిపై ముథోల్ ​ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఆయనకు కేటాయించిన టికెట్​ను క్యాన్సల్​ చేయాలని పలుమార్లు అధిష్ఠానం దృష్టికి తీసుకువచ్చామన్నారు.

విఠల్ ​రెడ్డి అనాలోచిత నిర్ణయాలు, ముథోల్​ అభివృద్ధిలో వెనుకబడడం, సీనియర్​ లీడర్లను పట్టించుకోవడం వంటి కారణాలు వచ్చే ఎన్నికల్లో సీటు కోల్పోయే అవకాశముందన్నారు. అయినా బీఫాం ​ఎమ్మెల్యేకే ఇస్తే తామంతా సపోర్ట్ చేయలేమని, త్వరలోనే భవిష్యత్ కార్యచరణ రూపొందిస్తామన్నారు. పార్టీ​అసమ్మతి నేతలు జీవీ రమణరావు, సౌంవ్లీ రమేశ్, సోలంకి భీంరావు, విశ్వనాథ్​ పటేల్, చిన్నారావు, మెండె శ్రీధర్, పండిత్​పటేల్​ తదితరులున్నారు.