గోదావరిఖని, వెలుగు: ఎన్నికల ప్రక్రియను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని రామగుండం అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడు, ఐఏఎస్ ఆఫీసర్ రాజేశ్ సింగ్ రాణా సూచించారు. శుక్రవారం ఆయన రామగుండం నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీస్‌కు వచ్చి ఫిర్యాదుల కేంద్రాన్ని తనిఖీ చేశారు.
పర్యవేక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసిన సీ విజిల్, 1950 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా వచ్చే ఫిర్యాదులను రిజిస్టర్‌లో నమోదు చేస్తున్నామని, ఫ్లయింగ్ స్క్వాడ్, వీడియో సర్వేలెన్స్, స్టాటిక్స్ టీమ్‌లకు సమాచారం అందించి తక్షణమే వాటిని పరిష్కరిస్తున్నామని రిటర్నింగ్ ఆఫీసర్ అరుణశ్రీ ఆయనకు వివరించారు. సోషల్ మీడియాలో ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఎవరైనా రాజకీయ నాయకులు తమ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి 83338 94668లో సంప్రదించాలని సూచించారు.