బైపోల్ ప్రచారంలో రాజగోపాల్ భార్య, బంధువులు

మునుగోడు ఎన్నిక ప్రచారాన్ని అన్ని పార్టీలు ముమ్మరం చేశాయి. అభ్యర్థుల తరుపున వారి కుటుంబ సభ్యులు ప్రచారంలో పాల్గొంటున్నారు. నాంపల్లి మండలంలో బీజేపీ అభ్యర్ధి రాజగోపాల్ రెడ్డి తరఫున ఆయన సతీమణి లక్ష్మి ఇంటింటికీ తిరిగి ఓటర్లను కలుస్తున్నారు. ఆమెతో పాటు, ఇతర కుటుంబ సభ్యులు ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నామని, ఎన్నికల తర్వాత తాను ప్రజలకు అందుబాటులో ఉంటానని లక్ష్మి చెప్పారు. ఇప్పటి వరకు మునుగోడు అంటే తెలియని వాళ్లు .. ఇప్పుడు మునుగోడు దగ్గర నల్గొండ ఉందని చెప్పుకునే స్థాయి వచ్చిందన్నారు.  మునుగోడులో 90 శాతం ప్రజలు బీజేపీ  వైపే ఉన్నారన్నారు.

 

 మునుగోడులో గెలుపు కోసం పార్టీలు హోరాహోరీ ప్రచారం చేస్తున్నాయి. ఎన్నికల గడువు మరో వారం రోజులే ఉండటంతో  నేతలంతా మునుగోడులోనే ప్రచారం చేస్తున్నారు. బీజేపీ నుంచి రాజగోపాల్ రెడ్డి, టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి బరిలో ఉన్నారు. నవంబర్ 3న పోలింగ్ జరగనుంది.