![రజనీ,ఐశ్వర్య రాయ్ కొత్త సినిమా](https://static.v6velugu.com/uploads/2022/02/Rajinikanth-and-Aishwarya-Rai-Bachchan--Nelson-Dilipkumar's-film_W81EJ6RDyH.jpg)
ఈ సంక్రాంతికి ‘అన్నాత్తే’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన రజినీకాంత్.. నెక్స్ట్ సంక్రాంతికి వచ్చేందుకు అప్పుడే ఓ సినిమాని లైన్‌లో పెట్టారు. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేయనున్న ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నాడు. ఈమధ్యనే అనౌన్స్‌మెంట్ వచ్చింది. ఐశ్వర్యారాయ్ హీరోయిన్‌గా నటించనుందని సమాచారం. ఇక దీని తర్వాత చేయడానికి కూడా ఒక ప్రాజెక్టును ఓకే చేశారు రజినీ. డైరెక్టర్‌గానే కాక రైటర్‌గాను, సింగర్‌గాను కూడా గుర్తింపు తెచ్చుకున్న అరుణ్‌రాజా కామరాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. ప్రస్తుతం ఉదయనిధి స్టాలిన్‌తో ‘ఆర్టికల్ 15’ని రీమేక్ చేస్తున్నాడు అరుణ్. బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే రజినీ కోసం తాను రాసుకున్న కథను బోనీకి వినిపించాడట అరుణ్. స్టోరీ బాగా నచ్చడంతో అరుణ్‌ని తీసుకుని రజినీ దగ్గరకు వెళ్లారట బోనీ. రజినీ కూడా స్టోరీ విని బాగా ఇంప్రెస్ అయ్యి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. దాంతో ప్రాజెక్ట్ సెట్ అయ్యింది. ‘కబాలి’లోని ‘నెరుప్పుడా’తో పాటు రజినీ నటించిన పలు చిత్రాల్లో పాటలు పాడాడు అరుణ్. ఇప్పుడు ఆయన్ని డైరెక్ట్ చేసే చాన్స్ కూడా సంపాదించాడు. రాహుల్‌తో కలిసి బోనీ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.